BigTV English

Amrapali Kata : ముగ్గురు అధికారులకు కీలక పోస్టింగులు.. అమ్రాపాలికి టూరిజం అథారిటీ సీఈఓ బాధ్యతలు

Amrapali Kata : ముగ్గురు అధికారులకు కీలక పోస్టింగులు.. అమ్రాపాలికి టూరిజం అథారిటీ సీఈఓ బాధ్యతలు

Amrapali Kata :


⦿ ముగ్గురు ఐఏస్‌లకు ప్రభుత్వం బాధ్యతలు
⦿ టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలి
⦿ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ
⦿ కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్
⦿ ఇంకా పెండింగ్‌లోనే రోనాల్డ్ రోస్‌ పోస్టింగ్

అమరావతి, స్వేచ్ఛ: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఐఏఎస్‌లకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలి కాటాను నియమించారు. వైద్యారోగ్యశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణీమోహన్‌‌ను ప్రభుత్వం నియమించింది. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు వాణీ ప్రసాద్‌‌కు ప్రభుత్వం అప్పగించింది. జాతీయ హెల్త్‌ మిషన్‌ డైరెక్టర్‌గా కరుణకు అదనపు బాధ్యతలు కూడా అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. అయితే మరో ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్‌కు మాత్రం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.


ఆఖరికి ఇలా..
పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని డీఓపీటీ పలువురు అధికారులను ఆదేశించింది. దీంతో ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఐఏఎస్ అధికారులను క్యాట్, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఊరట లభించకపోగా, ఏపీ ప్రజలకు సేవ చేయాలని లేదా అని క్యాట్ ప్రశ్నించింది. దీంతో ఐదుగురు ఐఏఎస్‌లు ఏపీకి తప్పక వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీలో రిపోర్టు చేసిన ప్రశాంతికి మాత్రమే పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం, మిగిలిన నలుగురి పోస్టింగ్‌లను పెండింగ్‌లో పెట్టింది. దీంతో మళ్లీ ఇంటర్‌స్టేట్ డిప్యూటేషన్‌పై తెలంగాణకు వెళ్తారని ప్రచారం జరిగింది. మరోవైపు సీఎంవోలో కీలక పదవి, డిప్యూటీ సీఎం పేషీలోకి ఆమ్రపాలి అని, జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. అయితే చివరికి టూరిజం బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

Also Read : నాణ్యతలో రాజీపడొద్దు… ఉపాధి హామీ పనులపై డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×