BigTV English

Raveena Tandon: ఇండస్ట్రీలో రాజకీయాలు జరుగుతాయి, ఆ హీరోయిన్‌తో విభేదాలు ఉండేవి.. ‘కేజీఎఫ్’ నటి వ్యాఖ్యలు

Raveena Tandon: ఇండస్ట్రీలో రాజకీయాలు జరుగుతాయి, ఆ హీరోయిన్‌తో విభేదాలు ఉండేవి.. ‘కేజీఎఫ్’ నటి వ్యాఖ్యలు

Raveena Tandon: మామూలుగా సినీ పరిశ్రమలో వారసులు అయితే ఒకలాగా ట్రీట్ చేస్తారు, వారసులు కాకుండా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎంట్రీ ఇస్తే ఒకలాగా ట్రీట్ చేస్తారు. అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయని, నెపోటిజం అనేది కామన్ అని వ్యాఖ్యలు కూడా వినిపిస్తుంటాయి. అయితే బాలీవుడ్ గురించి, అందులో జరిగే రాజకీయాల గురించి ఇప్పటికే చాలామంది ఓపెన్‌గా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘కేజీఎఫ్’ బ్యూటీ రవీనా టండన్ కూడా ఇండస్ట్రీలో జరిగే రాజకీయాల గురించి స్టేట్‌మెంట్ ఇచ్చింది. అంతే కాకుండా తనకు ఒక హీరోయిన్‌తో ఉన్న విభేదాల గురించి కూడా మాట్లాడింది.


వేరేవాళ్లు లాగేసుకున్నారు

రవీనా టండన్ (Raveena Tandon) ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌కు వచ్చి హీరోయిన్‌గా ఎదగాలనుకుంది. అందుకే కెరీర్ మొదట్లో ఎన్నో సమస్యలు ఎదుర్కుంది. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ‘సాజన్ ఛలే ససురాల్’ ‘విజయ్‌పత్’ లాంటి సినిమాల్లో రవీనా టండన్‌నే ముందుగా హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కానీ అనుకోకుండా ఆ రెండు సినిమాల్లో తన స్థానంలో వేరే హీరోయిన్లు నటించారు. అలా ఎందుకు జరిగింది అనే విషయాన్ని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మరోసారి గుర్తుచేసుకుంది రవీనా. ‘సాజన్ ఛలే ససురాల్’ సినిమాలో గోవిందకు జోడీగా రవీనా నటించాల్సింది. కానీ ఆ స్థానంలోకి కరిష్మా కపూర్ వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.


Also Read: 20 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా.. ఇన్నాళ్లకు విడుదలకు సిద్ధం

నేనెప్పుడూ అలా చేయలేదు

‘‘గోవిందతో కలిసి సాజన్ ఛలే ససురాల్‌లో నటించడానికి నేను ఒప్పుకున్నాను. కానీ అదే సమయంలో నాపై ఇండస్ట్రీలో ఎన్నో రాజకీయాలు జరిగాయి. నేనెప్పుడు మంచి పోటీనే నమ్ముతాను. అలా అయితేనే మనలోని బెస్ట్ బయటికి వస్తుందని అనుకుంటాను. కానీ నేను మరీ మొహం మీద కొట్టినట్టు మాట్లాడే మనిషిని కాదు. అందుకే నేనెప్పుడూ రాజకీయాలు, గ్రూపిజం చేయలేదు. కానీ మిగతావాళ్లు మాత్రం నాపై అతిదారుణంగా రాజకీయాలు నడిపించారు’’ అంటూ గుర్తుచేసుకుంది రవీనా టండన్. ‘సాజన్ ఛలే ససురాల్’ సినిమాలో తన స్థానంలోకి కరిష్మా కపూర్ రావడంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీనిపై కూడా రవీనా స్పందించింది.

అప్పుడు చిన్నపిల్లలం

‘అందాజ్ అప్నా అప్నా’ సినిమాలో కరిష్మా కపూర్, రవీనా టండన్ ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. అప్పటికీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ‘‘మొదట్లోనే అందరితో కలిసిపోలేము కదా. ఒకప్పుడు నేను, కరిష్మా చిన్నపిల్లలం. కానీ ఇప్పుడు నా పిల్లలు, కరిష్మా పిల్లలు మంచి ఫ్రెండ్స్. మేము ఇద్దరం కూడా చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం. మనుషులు ఎదుగుతూ ఉంటారు’’ అని చెప్పుకొచ్చింది రవీనా టండన్. ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన రవీనా.. ప్రస్తుతం సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీ అయిపోయింది. యష్ హీరోగా తెరకెక్కిన ‘కేజీఎఫ్’తో రవీనా సెకండ్ ఇన్నింగ్స్ మరొక మలుపు తీసుకుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×