Pylon In Amaravati: ఏపీలో ఇవాళ మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏపీ ప్రజల ఆశలు నెరవేరడానికి తొలి అడుగు పడుతుంది. ఏపీ ప్రజల ఆశలు నెరవేరడానికి పడనున్న తొలి అడుగు పడనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా అమరావతి పనులకు శంకుస్థాపన పడనుంది. మధ్నాహ్నం ఏపీకి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. 49 వేల కోట్లతో చేపడుతున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
అమరావతి పనుల పునర్నిర్మాణ పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి సూచికగా సుమారు 20 అడుగుల ఎత్తైన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అమరావతి, ఏపీని సూచించేలా ఆంగ్ల అక్షరం A ఆకారంలో పైలాన్‌ను డిజైన్ చేశారు. 49వేల కోట్ల వ్యయంతో 74 ప్రాజెక్ట్‌ల పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తారు. వీటితో పాటు మరో 8 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
2015లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మోడీనే అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పనులు పూర్తికాలేదు. ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు పట్టాలెక్కాయి. ఈ క్రమంలో మోడీ విభజన హామీలపై మాట్లాడే అవకాశం ఉంది. గతంలో ప్రకటించిన ప్రత్యేక హోదాకు కేంద్రం కట్టుబడి ఉందని తెలపనున్నారు మోడీ.
ఇక మోడీ ప్రసంగించే ప్రధాన వేదికపై కేవలం 14 మందికే అనుమతి ఇచ్చారు. ప్రధాని సభకు 5 వేల మంది పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు పంపింది ఏపీ ప్రభుత్వం. ఇక 175 నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా ప్రణాళికలు రచించారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీరందరికి కోసం కావాల్సిన ఏర్పాట్లను చేశారు. 3 వేల 400 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 8 రూట్లు , 11 పార్కింగ్ ప్రదేశాలు సిద్ధం చేశారు అధికారులు.
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం 6 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక మోడీ పర్యటన నేపథ్యంలో విజయవాడ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
Also Read: ఇదే జరిగితే ప్రపంచంలోనే మొదటి నగరం..! అమరావతికి తిరుగులేదు
మద్యాహ్నం 2 గంటల 55 నిముషాలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. అక్కడి నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌లో సచివాలయం వద్ద హెలిప్యాడ్ కు చేరుకోనున్నారు. హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోడీకి స్వాగతం పలుకనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇక 3 గంటల 20 నిముషాలకు ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదికకు చేరుకోనున్నారు మోడీ. 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకూ అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోంటారు మోడీ.
ఇక ప్రధాన వేదికపై ప్రధాని మోడీ సహా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్ , నారాయణలు ఉంటారు. ఇకేంద్ర మంత్రులు పెమ్మసాని, బండి సంజయ్, శ్రీనివాస భూపతి వర్మ, రామ్మోహన్ నాయుడు ఇతర వీఐపీలకు మాత్రమే అవకాశం ఉంది. అమరావతి రీస్టార్ట్ సభకు సినీ హీరో చిరంజీవి సహా ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.