BigTV English

AP Capital: ఇదే జరిగితే ప్రపంచంలోనే మొదటి నగరం..! అమరావతికి తిరుగులేదు

AP Capital: ఇదే జరిగితే ప్రపంచంలోనే మొదటి నగరం..! అమరావతికి తిరుగులేదు

AP Capital: ఎన్నెన్నో కలలతో, త్యాగాలతో, సంకల్పబలంతో అమరావతి పునరుజ్జీవం ఘనంగా జరుగుతోంది. కృష్ణా తీరంలో, వ్యూహాత్మక ప్రాంతంలో, అందరూ మెచ్చేలా.. అందరికీ నచ్చేలా.. ప్రజారాజధాని సాక్షాత్కరించబోతోంది. చాలా అడ్వాంటేజెస్ అమరావతికి ఉన్నాయి. ఆర్థిక, ఆరోగ్య, ఐటీ కేంద్రంగా వెలుగు వెలిగేందుకు సిద్ధమవుతోంది. పూర్తి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ గా తెరపైకి వస్తోంది. ఆంధ్రుల ఆశలను సజీవంగా ఉంచుతూ కథ మార్చబోతోంది. చరిత్ర సృష్టించేందుకు రెడీ అయింది. ఇంతకీ అమరావతికి ఉన్న అడ్వాంటేజెస్ ఏమున్నాయి?


పడిలేచిన కెరటంలా అమరావతి 2.0

అవును పీపుల్స్ క్యాపిటల్ RE BORN అయ్యేందుకు అంతా సిద్ధమైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా మే 2వ తేదీన అమరావతి పనులు పునఃప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఈ నగరానికి ముగింపు లేదు. పడిలేచిన కెరటంలా ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సగర్వంగా సిద్ధమంటోంది. అందుకే ఇది అమరాపురి.


స్ట్రాటజిల్ లొకేషన్ అమరావతికి ప్లస్

ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నెన్నో ప్రాధాన్యతలు ఈ నగరానికి సొంతం. స్ట్రాటజిల్ లొకేషన్ లో ఉన్న ఈ అమరావతి ప్రాంతం.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంది. సో భౌగోళికంగా సులభంగా అన్ని ప్రాంతాల వారు యాక్సెస్ చేయడానికి వీలున్న నగరమిది. కృష్ణా నది తీరంలో, విజయవాడ – గుంటూరు వంటి ముఖ్యమైన వాణిజ్య నగరాలకు సమీపంలో ఉండడం మరో అడ్వాంటేజ్. ఇది ఆర్థిక కార్యకలాపాలకు అనుకూలంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా అమరావతి డెవలప్

అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా డెవలప్ చేస్తున్నారు. ఇందులో లేటెస్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ సిటీ టెక్నాలజీ, సమర్థవంతమైన సిటీ ప్లాన్ ఉంది. సింగపూర్ స్ఫూర్తితో రూపొందిన డిజైన్లు, పర్యావరణ సమతుల్యత, జీవన ప్రమాణాలు పెంచేలా భవిష్యత్ నగరం ఉండబోతోంది. వాణిజ్య, విద్యా సంస్థలు, మెడికల్, ఐటీ హబ్‌లకు కేంద్రంగా మారే కెపాసిటీతో నిర్మాణం జరుపుకొనేందుకు సిద్ధమంటోంది. దీంతో ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి కీలకంగా మారబోతోంది అమరావతి.

నెక్ట్స్‌లెవల్ ట్రాన్స్ పోర్టేషన్

కంప్లీట్ గా కొత్త సిటీ నిర్మాణం కావడంతో భవిష్యత్ అవసరాల కోసం ఏం కావాలో వాటిని ముందుగానే గుర్తించి పనులు చేస్తున్నారు. విశాలమైన రోడ్లు, వంతెనలు, రవాణా వ్యవస్థలు, యుటిలిటీస్ ఇవన్నీ కీరోల్ పోషించబోతున్నాయి. ఇవన్నీ లాంగ్ టర్మ్ లో ఆర్థిక వృద్ధికి ఉపయోగపడనున్నాయి. ఇక కీలకమైన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కూడా రావడం ఖాయమే. దీంతో అమరావతి రూపురేఖలు మారుతాయి.

అమరావతి అభివృద్ధిలో గ్రీన్ స్పేస్‌లు

అమరావతి ప్రాంతం చారిత్రక వారసత్వ వారధిగా, భవిష్యత్ ఆశల సారధిగా ఉండబోతోంది. బౌద్ధ స్థూపాలు, శాతవాహన వంశ వారసత్వ సంపదతో పర్యాటక ఆకర్షణగా ఉండబోతోంది. అమరావతి అభివృద్ధిలో గ్రీన్ స్పేస్‌లు, జల వనరుల రక్షణ, సౌర శక్తి వంటి పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుంది. అమరావతిలో ఏర్పాటయ్యే ప్రతీదీ అంతర్జాతీయ ప్రమాణాలతో రాబోతోంది.

అమరావతిలో కావాల్సినంత లాండ్ స్పేస్

ఇప్పటికే ఉన్న రాజధాని నగరాలతో పోలిస్తే అమరావతికి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. మిగితా చోట్ల స్థల సమస్యలు ఉంటాయి. ఉన్నంతలోనే అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి. అమరావతిలో అలా కాదు.. కావాల్సినంత లాండ్ స్పేస్ ఉంటుంది. అందుకే మల్టిపుల్ ట్రాన్స్ పోర్టేషన్, విశాలమైన రోడ్లు, ఆధునిక నగర ప్రణాళిక, స్మార్ట్ సిటీ టెక్నాలజీ, పర్యావరణ అనుకూల డిజైన్‌లను అమలు చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆ ప్రకారమే గ్రీన్ స్పేస్‌లు, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రజారాజధానిలో ఉండబోతున్నాయి.

ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్

అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లో స్మార్ట్ సిటీ టెక్నాలజీ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ-ఎఫిషియెంట్ బిల్డింగ్‌లు, వాటర్ రీసైక్లింగ్ వంటివి వర్కవుట్ చేస్తారు. ఇది నీటి సరఫరా, కరెంట్, అలాగే వ్యర్థాల నిర్వహణలో మిగితా నగరాలతో పోలిస్తే చాలా ప్లస్ పాయింట్ గా అవుతుంది. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లు కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలెన్నిటినో సృష్టిస్తాయి. ఐటీ, ఆర్థిక సేవలు, ఎడ్యుకేషన్ హబ్‌లకు కేంద్రంగా మారే లక్ష్యంతో ఉంది.

అంతర్జాతీయ నగరాలకు దీటుగా అమరావతి

అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లో 50 శాతం కంటే ఎక్కువ భూమిని గ్రీన్ స్పేస్‌లు, నీటి వనరులు, పర్యావరణ సంరక్షణకు కేటాయించారు. ఇది స్థిరమైన అభివృద్ధికి ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. అమరావతి డిజైన్ అంతర్జాతీయ నగరాలతో పోటీపడేలా ఉంది. ఇది కొద్ది కాలంలోనే విదేశీ పెట్టుబడులను కచ్చితంగా ఆకర్షిస్తుంది. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మూడేళ్లలో పూర్తి చేసేలా పకడ్బందీ కార్యాచరణ

అమరావతి నిర్మాణం ఇంతకు ముందులా కాదు.. మూడేళ్లలో పూర్తి చేసేలా పకడ్బందీ కార్యాచరణ రెడీ చేశారు. గతంలో ప్రభుత్వం మారడంతో రాజధాని నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. మళ్లీ జంగిల్ క్లియరెన్స్, అంచనాలు పెరగడం, ఆర్థిక భారం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి కథ వేగంగా మార్చబోతున్నారు. మూడేళ్లలో పూర్తి చేయాలంటే ఎన్నో మల్టిపుల్ స్ట్రాటజీస్ అమలు చేయాల్సి వస్తుంది. నిధుల కొరత రాకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. మరి ఇన్ టైమ్ లో రాజధాని పూర్తవుతుందా?

నెక్ట్స్ జెనరేషన్ సిటీగా నిలవడానికి సన్నద్ధం

ఒక బలగం ఉంటుంది. వాటిని అందిపుచ్చుకుని ఒక భవిష్యత్ ను నిర్మించుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కూడా అదే చారిత్రక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అద్భుత నగరంగా నెక్ట్స్ జెనరేషన్ సిటీగా నిలవడానికి సన్నద్ధమవుతోంది. ఐకానిక్ టవర్స్ తో కథ మార్చేయబోతోంది. యావత్ ప్రపంచమే అబ్బురపడేలా తన కథ తానే రాసుకుంటోంది మన అమరావతి.

250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ బిల్డింగ్ టవర్

ప్రతి నగరం దాని నిర్మాణ అద్భుతాల ద్వారా తన కథను ప్రపంచానికి చాటుతుంది. ఒక్కో నగరానికి ఒక్కో ఐకానిక్ సింబల్ ఎలా ఉంటుందో అమరావతిలోనూ సిటీ నడిబొడ్డున లిల్లీ ఆకారంలో 250 మీటర్ల ఎత్తయిన అసెంబ్లీ బిల్డింగ్ టవర్ ఒక చరిత్ర లిఖించేందుకు సిద్ధమవుతోంది. అక్కడ నిలబడి చూస్తే చాలు.. 360 డిగ్రీస్ లో పనోరమిక్ వ్యూ కన్నుల పండుగగా మారనుంది. అసెంబ్లీ సెషన్ జరగనప్పుడు ప్రజల సందర్శన కోసం దీన్ని తెరిచే ఉంచేలా ప్లాన్ చేశారు. అసెంబ్లీ కాంప్లెక్స్‌లో మూడు అంతస్తుల భవనం ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతాయి. రెండో అంతస్తులో విజిటర్స్ గ్యాలరీ ఏర్పాటు చేయబోతున్నారు.

రాజధానిలో 9 సబ్ సిటీస్ నిర్మించే ప్లాన్

217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి అద్భుతమంతా సాక్షాత్కరించబోతోంది. సచివాలయ భవనం నాలుగు టవర్లుగా 50 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. అన్ని ప్రధాన డిపార్ట్ మెంట్లు ఇందులోనే ఉంటాయి. అంతే కాదు.. రాజధానిలో 9 సబ్ సిటీస్ ఉండబోతున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో ప్రాధాన్యత. నయా రాయ్‌పూర్, గాంధీనగర్‌ కొత్త నగరాలుగా తెరపైకి వచ్చాయి. అయితే అక్కడ జనం స్థిరపడకపోవడం, ఎకానమీ ఇంజిన్లుగా మారకపోవడం కొత్త నగరాలపై కొత్త డౌట్లు తీసుకొచ్చాయి. అయితే అమరావతి విషయంలో మాత్రం అన్నీ జాగ్రత్తగా స్టడీ చేశారు. క్యాపిటల్ సిటీ నిర్మాణం పూర్తయ్యాక అభివృద్ధి రాత్రికి రాత్రి జరిగేది కాదు. అయితే అభివృద్ధి దిశగా నడపాలంటే ఏం చేయాలన్నది కూడా ఇప్పుడే ప్లాన్ చేసి పెట్టారు. ప్రారంభంలోనే నగరం ఆర్థికాభివృద్ధికి ఆయువుపట్టుగా ఉండాలంటే ఇండస్ట్రీల వల్లే సాధ్యం. అందుకే నెక్ట్స్ జెనరేషన్ ఇండస్ట్రియల్ జోన్ ను గ్రీన్ ఫీల్డ్ గా తీర్చిదిద్దబోతున్నారు. వీటితోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. జనం రాక కూడా పెరుగుతుంది. అప్పుడే క్యాపిటల్ సిటీలో ఎకానమీ బూస్టప్ అవుతుంది.

కొత్త వెలుగులు విరజిమ్ముతున్న సీడ్ యాక్సెస్ రోడ్

ఆధునిక, స్థిరమైన, ఆర్థికంగా శక్తివంతమైన రాజధాని నగరాన్ని నిర్మించబోతోంది కూటమి ప్రభుత్వం. 2019 – 2024 మధ్య నిలిచిపోయిన పనుల్ని పట్టాలెక్కిస్తున్నారు. మూడేళ్లలో అద్భుతమే సృష్టించేలా కార్యాచరణ రెడీ చేశారు. ఏపీ రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే సగర్వంగా అమరావతి అని చెప్పుకునేలా తీర్చి దిద్దబోతున్నారు. ఇన్ని రోజులు చీకట్లో మగ్గిన 23 కిలోమీటర్ల పొడవైన ఎనిమిది లేన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు కొత్త వెలుగులు సంతరించుకుంది. మొదటి దశలో గత ప్రభుత్వ హయాంలో నిలిపేసిన 92 పనులను 64,912 కోట్ల వ్యయంతో పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఓవరాల్ గా వంద పనుల కోసం 77,249 వేల కోట్ల అంచనాతో చేపట్టినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. 15 వేల మంది కార్మికులతో పనులు శరవేగంగా జరగబోతున్నాయి.

Also Read: తండ్రి కూతుళ్ల ఆలోచన ఏంటి..? వైసీపీని ఎందుకు దెబ్బ కొట్టారు?

వరల్డ్ బ్యాంకు, ఏడీబీ రూ.13,400 కోట్ల రుణం

వరల్డ్ బ్యాంకు, ఏడీబీ చెరో 6,700 కోట్లు చొప్పున మొత్తంగా 13,400 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించాయి. కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు 5వేల కోట్లు ఇస్తోంది. హడ్కో నుంచి 11వేల కోట్లు రుణంగా తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. కేంద్రం మరో 15 వేల కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ గా ఇస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 94(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలనే నిబంధన ఉంది. ఆ ప్రకారమే ఇప్పుడు కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తోంది. ప్రధాని మోడీ అమరావతి పనులను స్వయంగా పునఃప్రారంభించబోతున్నారు. బ్యాంకులు, ఫండింగ్ ఏజెన్సీల నుంచి నిధులు తీసుకోగా.. మిగిలిన వాటిని భూములు మార్ట్‌గేజ్ చేయడం, అమ్మకాలు, లీజుకు ఇవ్వడం ద్వారా సేకరించబోతున్నారు.

360 కి.మీ. ట్రంక్ రోడ్ నెట్‌వర్క్‌కు ఏడాదిన్నర టార్గెట్

మూడేళ్లలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాలు పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు. 360 కిలోమీటర్ల పొడవైన ట్రంక్ రోడ్ నెట్‌వర్క్‌ను ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయనున్నారు. అంతే కాదు.. అమరావతిలో నిర్మించే అన్ని భవనాల పైకప్పులపై సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయనున్నారు. అంతే కాదు.. కూల్ వాటర్ అందించేలా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ను కూడా బిల్డింగ్స్ లో ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సో అమరావతిని మొదట అనుకున్న దానికంటే చాలా పెద్ద మెట్రోపాలిటన్ నగరంగా మార్చాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగా సింగపూర్ కన్సార్టియంతో చర్చలు జరుపుతోంది. అమరావతిని ఉత్తరం వైపు విజయవాడతో, దక్షిణం వైపు గుంటూరుతో కలిపి మెగా సిటీగా మార్చాలనే దీర్ఘకాలిక ప్రణాళిక కూడా ఉంది. ఇప్పటికే అమరావతి మీదుగా వెళ్లే రైల్వే లింక్, అలాగే ఔటర్ రింగ్ రోడ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో మంచిరోజులు తొందర్లోనే ఉన్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×