Congress: బీసీ బిల్లు అమలుకై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్.. నేడు జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనుంది. ఇప్పటికే ప్రత్యేక రైలు, విమానాల్లో కార్యకర్తలు, నాయకులంతా ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంట్ సెషన్స్ జరిగే సమయంలోనే ఈ ధర్నా జరగనుంది. దీని ప్రభావం లోక్‌సభ సమావేశంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, బీసీ సంఘ నాయకులు పాల్గొననున్నారు.
ఎంత జనాభా ఉంటే అంత వాటా అనేది కాంగ్రెస్ నినాదం. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే కులగనణ చేసిన సీఎం రేవంత్.. దాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం లభించినా.. కేంద్రం ముంద్ర పడాల్సిన బాకీ ఉంది. దీంతో మోడీ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాకు సిద్ధమైంది. సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, వామపక్షాలు, శివసేన, ఎన్సీపీ పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది.
తెలంగాణను రోల్‌మోడల్‌గా తీసుకుని దేశం మొత్త కులగణన చేయాలి మొదటి నుంచి కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. ఈ ధర్నాను విజయవంతం చేసి.. రాష్ట్రాలకు ఓ సందేశం పంపాలని దృడ నిశ్చయంతో ఉంది. 42శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబరు 30లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం ఉంది. ఎన్నికలు బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉదయం 10.30కు ప్రారంభం కానున్న ధర్నా
ఉదయం 10:30 గంటలకు మహాధర్నాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. సాయంత్రం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొంటారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన యూబీటీ, ఎన్సీపీ, ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ తదితర పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నట్లు సమాచారం.
తెలంగాణ పంపిన బిల్లులు ఆమోదించాలని రాష్ట్రపతి ముర్మును కోరేందుకు.. ఈ నెల 7న అపాయింట్‌మెంట్ కోరారు. ఒకవేళ అపాయింట్‌మెంట్ రాకపోతే రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది.
Also Read: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..
రిజర్వేషన్లు అమలు చేయకుండా బీజేపీ డబుల్ గేమ్ -విజయశాంతి
రిజర్వేషన్లు అమలు చేయకుండా బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందన్నారు ఎమ్మెల్సీ విజయశాంతి. బీసీల కోసం మరో ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పోరాటాలు తనకేం కొత్త కాదని, బిల్లు ఆమోదం పొందేవరకు కేంద్రంతో ఫైట్ చేస్తామన్నారు. రిజర్వేషన్ అమలయ్యే వరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బిల్లు ఆమోదం తెలపకపోతే బీసీలకు బీజేపీ ద్రోహం చేసినవారిగా మిగిలిపోతారన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు.
బిగ్ టీవీతో విజయశాంతి..
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోంది
విడిచి పెట్టే ప్రసక్తే లేదు
తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించాం..
ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడి సాధిస్తాం
– విజయశాంతి pic.twitter.com/RocwalujFu
— BIG TV Breaking News (@bigtvtelugu) August 6, 2025