BigTV English

Shakib Al Hasan vs Virender Sehwag: సెహ్వాగా.. అతనెవరు? షకీబ్ క్వశ్చన్

Shakib Al Hasan vs Virender Sehwag: సెహ్వాగా.. అతనెవరు? షకీబ్ క్వశ్చన్

Shakib Al Hasan Responds to Virender Sehwag’s Criticism: టీ 20 ప్రపంచకప్ లో పలు వింతలు, విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పాటు కౌంటర్లు, రీ కౌంటర్లు, ఎన్ కౌంటర్లు కూడా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టులో ఉన్న సీనియర్ క్రికెటర్, 37 ఏళ్ల షకీబ్ అల్ హాసన్ సంచలన కామెంట్లు చేయడం నెట్టింటిని షేక్ చేస్తోంది.


ఉదయం మ్యాచ్ లో  నెదర్లాండ్స్ పై షకీబ్ అద్భుతంగా ఆడి, 46 బంతుల్లో 64 పరుగులు చేయడమే కాదు.. బంగ్లాదేశ్ ను గెలిపించాడు, అలాగే సూపర్ 8 కి మార్గం సుగమం చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడాడు. అయితే రిపోర్టర్లు కొందరు కుదురుగా ఉండకుండా  టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాటలను గుర్తు చేశారు.

ఇంతకీ మన సెహ్వాగ్ ఏమన్నాడంటే.. షకీబ్ సీనియర్ అయిపోయాడు. టీ 20 ప్రపంచకప్ జట్టుకి పనికిరాడు. కేవలం కెప్టెన్ గా చేశాడనే కారణంగా ఆడిస్తున్నారు. అది కరెక్టు కాదు, అతడి గణాంకాలు చూసి సిగ్గుపడాలి. ఇకనైనా సొంతంగా షకీబ్ ముందుకొచ్చి వీడ్కోలు పలకాలి’ అని గుండెకు తగిలేలాగే అన్నాడు.


వాటిని రిపోర్టర్లు ఇప్పుడు గుర్తు చేసి, ఇప్పుడు మీరేం చెబుతారని అన్నారు. దాంతో తనేమన్నాడంటే ‘సెహ్వాగా’ అతనెవరు? అని ప్రశ్నించాడు. అంతే అక్కడికి వచ్చిన రిపోర్టందరూ షాక్. కాసేపు ఎవరికి నోట మాట రాలేదు. అలాగే ఉండిపోయారు.

షకీబ్ మాత్రం ఆ టాపిక్ ను కొనసాగించకుండా అక్కడితో దానిని కట్ చేసి మ్యాచ్ గురించి చెప్పాడు. ఇన్నింగ్స్ చివరి వరకు టాప్ నలుగురిలో ఒకరైనా చివరి వరకు ఉండాలని, ఒక ప్రణాళికతో వచ్చాం. ఆ అవకాశం నాకు వచ్చింది. బ్యాటింగులో ఇంత విలువైన ఇన్నింగ్స్ ఆడటం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు.

Also Read: ఆ ఇద్దరూ ఇంటికి వచ్చేస్తున్నారు..

అయితే మేం నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యం పెద్దది కాదని అన్నాడు. కానీ మా బౌలర్లు సరైన సమయంలో వికెట్లు తీసి నెదర్లాండ్స్ ను ఒత్తిడిలోకి నెట్టారని అన్నాడు. ప్రస్తుతం గ్రూప్ డిలో రెండో స్థానంలో ఉన్న నేపాల్ తో బంగ్లాదేశ్ చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అక్కడ ఎవరు గెలిస్తే వారు సూపర్ 8 కి చేరతారు.

అయితే ఇప్పుడు నెదర్లాండ్స్ తో గెలవడం వల్ల బంగ్లా జట్టు కొంచెం ఊపిరి తీసుకుంది. మొత్తానికి షకీబ్ మాత్రం టీమ్ ఇండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సెహ్వాగ్ కి మాత్రం చిన్న ఝలక్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×