BigTV English

Visakha City: విశాఖకు ఫుల్ జోష్.. సూపర్ ప్రాజెక్ట్ వస్తోంది.. నగరంలో ఇక సందడే సందడి!

Visakha City: విశాఖకు ఫుల్ జోష్.. సూపర్ ప్రాజెక్ట్ వస్తోంది.. నగరంలో ఇక సందడే సందడి!

Visakha City: విశాఖ వాసులకు అదృష్టం ఎలా ఉందంటే.. ప్రభుత్వ దృష్టి విశాఖపై పడడంతో వరాలజల్లు కురుస్తోంది. ఎటు చూసినా పరిశ్రమల జోరు కొనసాగే అవకాశం ఇప్పటికే ఉండగా, ప్రభుత్వం విశాఖకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో నగర అందంతో పాటు, ఎందరో యువకులకు ఉపాధి అవకాశాలు దరిచేరనున్నాయి. ఇంతకు విశాఖ వాసులను తెగ సంబరపెట్టే ఆ శుభవార్తలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.


ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తాజాగా ఒక కీలకమైన ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతిపాదించిన వరుణ్ బే సాండ్స్ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ముందుకు వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు రూ. 899.50 కోట్లు. ఇది ఇప్పటికే ఉన్న తాజ్ గేట్‌వే హోటల్‌ను పూర్తిగా పునర్నిర్మించి, అంతర్జాతీయ స్థాయిలో కొత్త హోటల్‌గా తీర్చిదిద్దే ప్రణాళికని చెప్పవచ్చు.

ఈ ప్రాజెక్టులో 318 రూంలతో కూడిన 5 నక్షత్రాల హోటల్, అలాగే సర్వీస్ అపార్ట్‌మెంట్లు, వాణిజ్య కార్యాలయ స్థలాలు కూడా ఉండనున్నాయి. పర్యాటకులకు విశాఖలో ఒక ప్రపంచస్థాయి అనుభవాన్ని కల్పించాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. ఈ నిర్మాణం పూర్తయ్యాక సుమారు 1,300 మందికి ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా.


పాత ప్రణాళిక.. కొత్త మార్గం
ఇది మొదటగా 2020-25 టూరిజం పాలసీ కింద మంజూరు అయినా, అప్పటి ప్రోత్సాహకాలు అంతగా సహకరించకపోవడంతో సంస్థ నిర్మాణాన్ని ప్రారంభించలేదు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన 2024-29 టూరిజం పాలసీ కింద మరింత ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు లభించడంతో సంస్థ మళ్లీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమైంది. ఈసారి ప్రాజెక్టును అల్ట్రా మెగా టూరిజం ప్రాజెక్ట్ గా గుర్తించారు. దీనికి సంబంధించిన టెక్నికల్, ఆర్థిక అధ్యయనాలు పూర్తయ్యాయి. రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (SIPB) ఈ ప్రాజెక్టును ఆమోదించింది.

ప్రోత్సాహకాలు ఇవే..
ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఎన్నో ప్రయోజనాలను కల్పించింది. 15 సంవత్సరాల పాటు లేదా పెట్టుబడి పూర్తయ్యేంత వరకు SGST మొత్తం తిరిగి చెల్లింపు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మాఫీ, భూమి వినియోగ మార్పుల ఛార్జీలు మినహాయింపు, మొత్తం పెట్టుబడిపై 10% మూలధన సబ్సిడీ, పరిశ్రమ రేట్లకు విద్యుత్, నీటి ఛార్జీలు, ఉద్యోగాలపై ఆధారపడి ఉపాధి ప్రోత్సాహకాలు ఇలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా, ప్రైవేట్ సంస్థలు పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు మరింత ఆసక్తి చూపేలా ప్రభుత్వ విధానం ఉంది. ఇది కేవలం హోటల్ నిర్మాణమే కాదు, విశాఖపట్నానికి ఒక కొత్త ముఖచిత్రాన్ని తీసుకురావడమని నగరవాసులు అంటున్నారు.

Also Read: AP Tourist Place: ఏపీలో వర్షాలు.. ఈ ప్లేస్ కు వెళ్లారో.. నీటితో మాట్లాడే ఛాన్స్!

వంతెనకు ప్రత్యేక గుర్తింపు
ఈ ప్రాజెక్టులో మరో విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం ఉన్న నోవాటెల్ హోటల్‌ను కొత్తగా వచ్చే వరుణ్ బే సాండ్స్ ప్రాజెక్ట్‌కి కలపడానికి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా నిర్మించనున్నారు. ఈ వంతెనను ఐకానిక్ ఆర్కిటెక్చర్గా తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ నిర్మాణ బాధ్యత విశాఖపట్నం మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) తీసుకోనుంది. మే 22, 2025న ప్రభుత్వం దీనికి అధికారిక ఆమోదం కూడా ఇచ్చింది.

పర్యాటక రంగానికి కొత్త ఊపిరి
ఈ ప్రాజెక్ట్ పూర్తవడం ద్వారా విశాఖపట్నం నగరానికి మరో మెరుగైన గమ్యం ఏర్పడుతుంది. విదేశీ పర్యాటకులే కాకుండా దేశీయంగా కూడా ప్రజలు ఇక్కడి సౌకర్యాలను ఆస్వాదించేందుకు రావచ్చు. హోటల్‌ మాత్రమే కాదు, వాణిజ్య కార్యాలయాలు, సమావేశాల హాల్స్ వంటి సదుపాయాలతో ఇది ఒక పెద్ద టూరిజం హబ్‌గా అభివృద్ధి చెందనుంది. విశాఖలోని సముద్రతీరానికి మరింత ఆకర్షణ, అవకాశాల్ని తీసుకువచ్చే ఈ ప్రాజెక్ట్‌ వల్ల నగర అభివృద్ధికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.

అదే సమయంలో ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు మరింత ప్రయివేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గం సుగమం చేస్తున్నాయి. మొత్తం మీద విశాఖ నగరానికి సరికొత్త అందాన్ని తెచ్చేలా, యువతకు ఉపాధి అందేలా ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×