OTT Movie : హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంటాయి. ఈ సినిమాలకు ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉంటారు. తెలుగులో కూడా ఇవి డబ్ అవుతుండటంతో వీటిని మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు మూవీ లవర్స్. అయితే వీటిలో సర్వైవల్ థ్రిల్లర్ తో వచ్చే సినిమాలు ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక అమ్మాయి సముద్రంలో ఇరుక్కుపోతుంది. అక్కడ ఉండే రాక్షస జంతువుతో ఈమె పోరాడాల్సి వస్తుంది. ఆ తర్వాత స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
జెన్ (కియర్సీ క్లెమన్స్) అనే యువతి ఒక పడవలో వెళ్తున్నప్పుడు ఒక ప్రమాదం వస్తుంది. దానివల్ల ఆమె సముద్ర తీరంలోని ఒక చిన్న నిర్జనమైన ద్వీపంలో చిక్కుకుంటుంది. ఆమెకు తన స్నేహితుడు బ్రాడ్ ఈ ప్రమాదంలో గాయపడిన స్థితిలో కనిపిస్తాడు. కానీ అతను త్వరలోనే చనిపోతాడు. జెన్ ఆ ద్వీపంలో ఒంటరిగా ఆహారం కోసం వెతుకుతూఉంటుంది. ఇందులో ఎలా జీవించాలి అనే సందేహంలో ఉంటుంది. అయితే ఆ ద్వీపం అంత సాధారణమైనది కాదని ఆమెకు త్వరలోనే తెలుస్తుంది. రాత్రి సమయంలో, సముద్రం నుండి ఒక భయంకరమైన జీవి బయటకు వచ్చి ద్వీపంలోని మిగతా జీవులపై దాడి చేసి, వాటిని చంపుకుని తింటుంది. ఈ రాక్షస జీవి ఒక విచిత్రమైన, భయంకర రూపంలో ఉంటుంది. ఇది జెన్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది. ఆమె ఈ జీవి నుండి తప్పించుకుంటూ, దానితో ధైర్యంగా పోరాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఆ ద్వీపంలో గతంలో జరిగిన కొన్ని రహస్యాలు కూడా తెలుస్తాయి. చివరికి జెన్ ఈ రాక్షస జీవి నుండి తప్పించుకుంటుందా ? ఆ ద్వీపంలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి ? ఆమెకు ఎవరైనా సాయం చేస్తారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒక్క మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు… ఊహకందని ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళం థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ హారర్-సర్వైవల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘స్వీట్‌హార్ట్’ (Sweetheart). 2019 లో వచ్చిన ఈ మూవీకి J. D. డిల్లార్డ్ దర్శకత్వం వహించారు. ఇందులో కీర్సీ క్లెమన్స్ ప్రధాన పాత్రలో నటించగా, ఎమోరీ కోహెన్, హన్నా మంగన్-లారెన్స్, ఆండ్రూ క్రాఫోర్డ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ సముద్రంలో ఒక ఒంటరి మహిళ ఎదుర్కునే భయంకరమైన సన్నివేశాల చుట్టూ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.