Rain Alert In AP: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ చల్లటి కబురు వచ్చేసింది. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం మయన్మార్ నుంచి అండమాన్ మధ్య ఏర్పడినట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు అంచనా వేసింది. అండమాన్‌లోని మాయాబందర్‌కి 580 కి.మీ దూరంలోని తూర్పు ఈశాన్య మధ్య కేంద్రీకృతమైంది.
ఉత్తర వాయవ్య బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. 72 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని అంచనా. రాబోయే 24 గంటల్లో ఉత్తర అండమాన్-మయన్మార్‌లోని దానిని ఆనుకుని ఉన్న ఇరావడి ప్రాంతం వైపు కదిలే అవకాశం ఉంది. వాతావరణ శాఖ దాని మార్గం, తీవ్రతను ఎప్పటికప్పుడు గమనిస్తోంది. అండమాన్ సముద్రాన్ని చేరిన తర్వాత మరింత బలపడుతుందా? దాని తదుపరి గమనం ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టత రాలేదు.
ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని ఓ అంచనా. ఈ వాయుగుండంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటింది.
దీనికారణంగా నాలుగైదు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. రాబోయే 24 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో ఈశాన్య, ఉత్తర, నైరుతి బెంగాల్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది వాతావరణ శాఖ.
ALSO READ: శ్రీకాకుళంలో తీవ్ర విషాదం.. పురుగుల మందు కొట్టిన ఆకులు తిని 35 మూగజీవులు మృతి!