BigTV English
Advertisement

KA Paul Vote in Visakhapatnam: 9 గంటలకు పోలింగ్.. ఓటు వేసిన కేఏపాల్.. సంచలన వ్యాఖ్యలు!

KA Paul Vote in Visakhapatnam: 9 గంటలకు పోలింగ్.. ఓటు వేసిన కేఏపాల్.. సంచలన వ్యాఖ్యలు!

KA Paul Vote in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వాతావరణం కాస్త చల్లగా ఉండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఏపీలో ఉదయం 9 గంటలకు 9.01 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది.


కడపలో అత్యధికంగా, గుంటూరులో అత్యల్పంగా పోలింగ్ నమోదు అయినట్టు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 9.27 శాతం, మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10, పులివెందులలో 12.44 శాతం పోలింగ్ నమోదు అయినట్టు అధికారులు వివరించారు.

విశాఖ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కేఏ పాల్. కేంద్రాల వద్ద ఓటర్లను చూసి ఆయన ఉబ్బితబ్బిబయ్యారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే ప్రజాస్వామ్యంలో ఇదే చివరి ఎన్నికలని కొందరు అంటున్నారని తెలిపారు కేఏపాల్. యూత్, చదువుకున్నవారు అధికంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చినట్టు చెప్పుకొచ్చారు.


Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

రండి.. మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు. నచ్చినవారికి వేయాలని చెబుతూనే క్రిమినల్స్‌కు ఓటు వేయవద్దని మనసులోని మాట బయటపెట్టారు కేఏ పాల్. విశాఖ ఎంపీ, గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది.

Tags

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×