Ranveer Singh – Prasanth Varma Combo Movie Title: ఒక్క సినిమా చాలు లైఫ్‌ని మార్చేయడానికి.. ఒక్క సినిమా చాలు ఎనలేని గౌరవాన్ని తీసుకురావడానికి.. ఒక్క సినిమా చాలు అవకాశాలను తెచ్చిపెట్టడానికి.. ఇలాంటి ఆ ఒక్క సినిమా కోసం నటీ నటులు, దర్శకులు ఎంతో శ్రమిస్తారు. ఒక్క సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ అయితే చాలు ఇక లైఫే మారిపోతుంది అని డెటికేషన్‌తో హార్డ్ వర్క్ చేసిన వారు లేకపోలేదు. అయితే అలానే హిట్లు అందుకున్న వారు కూడా ఉన్నారు. అందులో ప్రముఖ యంగ్ అండ్ క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒకరు.
2018లో ‘అ!’ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమా తీసి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తేజ సజ్జతో ‘జాంబి రెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.10 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది.
ఈ మూవీతో దర్శకుడిగా ప్రశాంత్ వర్మ పేరు మారు మోగిపోయింది. క్రియేటివ్ కాన్సెప్ట్‌తో ‘జాంబి రెడ్డి’ తెరకెక్కించి మంచి హిట్ అందుకోవడంతో తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో ఈ సారి కూడా మరింత భారీ స్థాయిలో హిట్ కొట్టాలని అనుకున్నాడు. దీంతో ‘జాంబి రెడ్డి’ కాంబినేషన్ మరోసారి ఫిక్స్ అయింది. తేజ సజ్జ – ప్రశాంత్ వర్మ కాంబోలో ‘హనుమాన్’ మూవీ తెరకెక్కింది.
Also Read: సినిమాల్లో నటించాలని ఉందా..? ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపరాఫర్..!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఒక్క చిన్న సినిమాగా థియేటర్లలో విడుదల అయిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుని దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరును యావత్ సినీ ప్రియులకు తెలిసేలా చేసింది. ఈ మూవీతో ప్రశాంత్ వర్మ అంటే తెలియనివారు లేకపోలేదు.
ఈ మూవీతో అతడికి అవకాశాలు వెల్లువెత్తాయి. బాలీవుడ్‌లో సైతం భారీ సినిమా ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు సైతం ప్రశాంత్ వద్దకు క్యూ కట్టారు. ఈ క్రమంలో ప్రశాంత్.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కాంబో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవమెంత ఉందో తెలియదు కానీ.. ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
Also Read: G V Prakash Kumar: సినీ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట విడాకులు.. 11 ఏళ్ల బంధానికి గుడ్ బై
ఇప్పుడు ఈ మూవీ టైటిల్‌కు సంబంధించి ఓ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి గానూ ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ‘హనుమాన్’ సినిమాటిక్ యూనివర్స్‌ను ప్రశాంత్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘బ్రహ్మరాక్షస’ ఉంటుంది అని కూడా టాక్ వినిపిస్తుంది.