BigTV English

Janasena Protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన.. ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై నిరసన!

Janasena Protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన.. ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై నిరసన!

Janasena Protest Outside College in Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన కార్యకర్తలు అర్థరాత్రి ఆందోళనకు దిగారు. ముఖ్యంగా ఈవీఎంలు భద్రపరిచే ఎస్ఆ‌ర్కేఆర్ కాలేజీ గేటు బయట నిరసన తెలిపారు. ముఖ్యంగా ఈవీఎంలను ప్రైవేటు కారులో తరలించడాన్ని అడ్డుకున్నారు.


ఈవీఎంల సీళ్లు తొలగించినట్లు ఉన్నాయని ఆరోపించారు జనసేన నేతలు. ఇక్కడకు సమీపంలో వైసీపీ నాయకుల ఇళ్లు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తంచేశారు. ఆందోళన చేస్తున్నవారికి నచ్చ జెప్పేందుకు పోలీసులు రంగం ప్రవేశం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ నుండి ఎన్నికల పోలింగ్ మోనిటర్ చేస్తున్న జిల్లా కలెక్టర్‌కు ఈ విషయం తెలిసింది.

వెంటనే హుటాహుటిన ఎస్.ఆర్.కె.ఆర్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఆ వాహనం రిజర్వ్డు ఈవీఎం‌లకు సంబంధించినదని వివరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు రెండు, మూడు రిజర్వుడ్ ఈవీఎం‌లను పంపడం జరుగుతుందన్నారు. వాటిని ఆయా వాహనాల్లో తీసుకుని వస్తున్నారని తెలిపారు. పోలింగ్‌కు వినియోగించిన ఈవీఎంలను తీసుకువచ్చే వెహికల్ కాదని స్పష్టంచేయడంతో గందరగోళ పరిస్థితి సద్దుమణిగింది.


Also Read: వారణాసికి బాబు, పవన్, మోదీ నామినేషన్‌కు హాజరు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభకు మే 13న ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్ర ఆరు వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఆరు దాటినా ఓటర్లు క్యూలో ఉండడంతో  కంటిన్యూ చేశారు. దీంతో ఈవీఎంలను తీసుకొచ్చేందుకు అర్థరాత్రి దాటింది. ఈవీఎంల తరలింపును పసిగట్టిన జనసేన నేతలు భీమవరంలోకి ఎస్.ఆర్.కె.ఆర్ కాలేజీ కాలేజ్ గేటు బయట నిరసన చేపట్టారు. కాలేజ్ వద్ద సీసీకెమెరాలతోపాటు మూడంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో దాదాపు 81 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారుల అంచనా.

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×