E-Paper
Advertisement

YCP Candidate Manhandling on Voter: పోలింగ్ బూత్ వద్ద దారుణం.. ఓటర్‌ని కొట్టిన వైసీపీ అభ్యర్థి శివకుమార్..!

YCP Candidate Manhandling on Voter:  పోలింగ్ బూత్ వద్ద దారుణం.. ఓటర్‌ని కొట్టిన వైసీపీ అభ్యర్థి శివకుమార్..!
Advertisement

YCP Candidate Manhandling to Voter: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొందరగా ఓటు వేసి ఇంటికి వెళ్లిపోయాలని నిర్ణయించుకున్నారు ఓటర్లు. అయితే పోలింగ్ కేంద్రంలో దౌర్జన్యం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి. అంతేకాదు ఓటరు చెంప చెళ్లుమనిపించారు కూడా.

తాజాగా వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ క్యూలైన్‌లో వెళ్లకుండా నేరుగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. ఆయన వెళ్లడం గమనించిన ఓటరు.. అభ్యంతరం వ్యక్తంచేశారు. పట్టరాని కోపంతో ఆయనపైకి దూసుకెళ్లారు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. అంతటితో ఆగకుండా ఓటరు చెంప చెళ్లుమనిపించారు.

Advertisement

అది చూసి షాకైన ఓటరు, ఆయనపైకి ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో అభ్యర్థి అనుచరులు ఓటరుని పోలింగ్ స్టేషన్ వద్దు చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

Also Read: 9 గంటలకు పోలింగ్.. ఓటు వేసిన కేఏపాల్, సంచలన వ్యాఖ్యలు

Advertisement

మరోవైపు హిందూపురం‌లోని చలమతూర్ మండలం హుసేన్‌పురం గ్రామంలో టీడీపీ నాయకుడు బాబు‌రెడ్డి పై వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు.  దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో తెలియక కొంతమంది ఓటర్లు భయంతో పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వాళ్లని చెదరగొట్టారు. సరైన సమయంలో పోలీసులు వచ్చారని లేకుంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు స్థానికులు.

Also Read: Chandrababu pawan in Varanasi: వారణాసిలో బాబు, పవన్, ఎన్డీయే నేతలతో భేటీ

Tags

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×