AP Assembly live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. వివిధ సమస్యలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సభలో మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. వివిధ సమస్యలపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సభలో మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.
అటు మండలిలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలు కాగానే వైసీపీ సభ్యులు యూరియా సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయం పూర్తి తర్వాత ఏ అంశంపైనా చర్చకు సిద్ధమేనని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. యూరియా, వ్యవసాయ ఉత్పత్తులపై ఎన్ని గంటలైనా చర్చకు రెడీ అని అన్నారు.
అయినా వైసీపీ సభ్యులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ ఆందోళనను కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రలు సమాధానాలు చెప్పారు. సభలో గందరగోళం నేపథ్యంలో ఒకసారి మండలి వాయిదా పడింది.
ALSO READ: ఏపీలో కొత్తగా 26 రైల్వే ప్రాజెక్టులు.. 11 కొత్త లైన్లు
మళ్లీ ఐదు నిమిషాల తర్వాత మండలి సమావేశాలు మొదలయ్యాయి. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ యూరియా వ్యవహారంపై నోరు విప్పారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో చర్చ పెట్టాలని తాము కోరుతున్నామని, ప్రభుత్వం రెడీగా ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలస్యమని అన్నారు. ఈ అంశంపై రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు.
బీఏసీలో చర్చించిన తర్వాత యూరియా అంశంపై చర్చిద్దామని ఛైర్మన్ చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. శుక్రవారం సభలో చర్చిద్దామని ఛైర్మన్ చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సభ్యుల ఆందోళన నేపథ్యంలో రెండోసారి సభ వాయిదా పడింది.