BigTV English

YS Jagan: అసెంబ్లీ సమావేశాలకు ధీటుగా జగన్ కూడా

YS Jagan: అసెంబ్లీ సమావేశాలకు ధీటుగా జగన్ కూడా

YS Jagan: వైసీపీ అధినేత జగన్‌కు టెన్షన్ మొదలైందా? వైసీపీ సోషల్ పంచాంగ‌ కర్తలు ఒకొక్కరుగా బయటకు వస్తున్నారా? వర్రా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపెట్టడంతో అవినాష్‌రెడ్డికి కష్టాలు తప్పవా? అనకొండలను పట్టుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్‌తో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. దీన్ని డైవర్ట్ చేసేందుకు మీడియా ముందుకొస్తున్నారు మాజీ సీఎం జగన్.


ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వైసీపీ మాత్రం దూరంగా ఉంది. కేవలం శాసనమండలికి మాత్రమే హాజరవుతోంది. వైసీపీ సోషల్ మీడియా వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. వర్రా రవీంద్రారెడ్డి కీలక విషయాలు వెల్లడించడంతో అవినాష్‌రెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు.

సజ్జల భార్గవ్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారట. ఈ వ్యవహారం వైసీపీ ఇమేజ్‌ని మరింత డ్యామేజ్ చేస్తోంది. మరోవైపు గతంలో నేతలు చేసిన కామెంట్స్‌పై ఆ పార్టీ నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఫ్యాన్  పార్టీలో ఉక్కపోత మొదలైంది.


వైసీపీ సోషల్‌మీడియా గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరిట యూట్యూబ్ ఛానెళ్లలో పని చేసిన వారికి జీతాలు ఇవ్వడంతో మరో క్విడ్ ప్రోకోగా వర్ణిస్తున్నారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 65 మంది జీతాలిచ్చారట. వారిని సోషల్ మీడియా కార్యకర్తలుగా ఉపయోగించుకోవడంతో జగన్ అడ్డంగా బుక్కయ్యారు.

ALSO READ:  ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు, కాసేపట్లో నోటిఫికేషన్

ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సాయంత్రం మూడుగంటలకు జగన్ మీడియా ముందుకు రానున్నారు. సోషల్‌మీడియా వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు కొత్త పల్లవిని ఎత్తుకోనున్నారట. రీసెంట్‌గా చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాట్లాడతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పార్టీ నేతలు జగన్ అసెంబ్లీకి రారని అంటున్నారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజును రకరకాలుగా ఇబ్బందులు పెట్టింది గత వైసీపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చాక స్పీకర్‌గా అయ్యన్న, డిప్యూటీ స్పీకర్‌గా రఘురామరాజు ఎన్నిక కానున్నారు. ఈ లెక్కన జగన్ అసెంబ్లీకి రారన్నది ఆ పార్టీ నేతల మాట.

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×