Gundeninda GudiGantalu Today episode November 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ ను రోహిణి డబ్బులు కావాలని అడుగుతుంది. ఆ విషయం ప్రభావతి వింటుంది. డబ్బులు నువ్వే ఎలాగైనా సర్దు అని అంటాడు. దానికి నాతో చిల్లి గవ్వ కూడా లేదు అని అంటుంది. ఇక మీనాక్షికి ఫోన్ చేసి గుడికి రమ్మని చెబుతుంది ప్రభావతి. మీనాక్షి ని డబ్బులు కావాలని అడుగుతుంది. తన దగ్గర అంత మొత్తం లేదని కావాలంటే 25000 ఇస్తానని చెబుతోంది. ఈ సమయంలో ఓ ఉచిత సలహా ఇస్తుంది. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తానంటే వెళ్లగొడుతున్నావని కామాక్షిని తిరిగి ప్రశ్నిస్తోంది. ‘అదే మీ చిన్న కోడలు..రవి గాడి పెళ్ళాం.. వాళ్ళు కోట్లకు పడగలెత్తినవాళ్లు అనగానే ప్రభావతి రవి శృతిని ఇంట్లోకి రానివ్వడానికి ఆలోచిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా సత్యంకు జ్యుస్ ఇస్తుంది. చేసిందంతా చేసి ఇప్పుడు మాత్రం జ్యుస్ లు ఇస్తున్నావా అని మీనా పై ప్రభావతి నిప్పులు పోసుకుంటుంది. మీనాకు బాలు మందులు ఇస్తాడు. సత్యం తల్లి ఫోన్ చేసి.. అతని యోగక్షేమాలను అడుగుతుంది. తనకు రోజు పీడ కలలు వస్తున్నాయని, తనకు ఆందోళనగా ఉందని చెబుతోంది. తాను బాగానే ఉన్నానని, తన ఆరోగ్యం సెట్ అయిందని సత్యం చెబుతాడు. అయితే.. దీపావళి పండుగకు ఇంటికి రమ్మని సత్యం తల్లి పిలుస్తుంది. కానీ ప్రభావతి రాలేమని చెబుతోంది. తాను రవికి మంచి పిల్లను చూసానని, ఒకసారి ఆ అమ్మాయిని చూడ్డానికి రమ్మని, దీపావళి కూడా అందరం కలిసి చేసుకోవచ్చని చెబుతోంది. తాము సంక్రాంతికి ఎలాగో వస్తామని, ఇప్పుడు అనవసరంగా ఖర్చులు ఎందుకని సత్యం సర్ది చెబుతాడు.. ఇక బామ్మ ప్రభావతి పై సెటైర్స్ వేస్తుంది. మీ అమ్మకు మీనా గురించి నిజం చెబుతాను అని అంటుంది. కానీ వద్దని చెబుతారు.
ఇక అందరు లోపలికి వెళ్ళిపోతారు. మనోజ్.. రోహిణి దగ్గరకు వెళ్లి.. తనకు బోనస్ ఇచ్చారని తన తల్లి ఇచ్చిన డబ్బులను ఇస్తాడు. సంక్రాంతికి కూడా బోనస్ ఇస్తారు అప్పడు కూడా ఖచ్చితంగా అడిగి తీసుకోమ్మని చెప్పుతోంది రోహిణీ. ఇక ఎక్కువ మాట్లాడితే.. అసలు విషయం బయటపడుతోందని, తనకు పని ఉందని బయటపడుతాడు మనోజ్.. ఆ తర్వాత రోహిణీ .. దినేష్ కు ఫోన్ చేసి డబ్బులు రెడీ చేశానని చెబుతుంది. దీంతో తాను చెప్పిన చోటుకు రోహిణిని రమ్మని చెప్పి దినేష్ అంటాడు. ఇక రోహిణి అక్కడికీ కలవడానికి వెళ్తుంది. రోహిణీ టెన్షన్ పడుతూ.. డబ్బులు తీసుకెళ్లి దినేష్ కు ఇస్తుంది. నేను అడిగినంత ఇవ్వకుండా.. కేవలం 25 వేలు మాత్రమే ఇవ్వడమేంటి? నేనేమైనా బిచ్చగాడినా? నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది? నేనిప్పుడు అడిగితే.. అప్పుడు డబ్బులు ఇవ్వాలని వార్నింగ్ ఇస్తాడు. దీంతో చిరాకు వచ్చిన రోహిణి ఏం చేసుకుంటావో.. చేసుకోపో అని అంటుంది..
ఆ మాట అనగానే కోపంతో రగిలిపోయిన దినేష్ తనకు కోలుకోలేని దెబ్బ కొట్టాలని అనుకుంటాడు.. అయితే.. జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉంటే.. ఇకనుండి వెళ్ళిపో.. అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇకపోతే దీనేష్ మాటలకు రోహిణీ ఆగిపోతుంది. తనకు వీలైనంత డబ్బులు సమకూర్చానని, తన దగ్గర డబ్బులు లేవని రిక్వెస్ట్ చేసుకుంటుంది. తనకు మాత్రం డబ్బుల విషయంలో చాలా స్ట్రీట్ గా ఉంటాననీ, మరో వారం 10 రోజులలో మిగతా డబ్బు సమకూర్చమని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు దీనేష్. ఇక రోహిణి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
మీనా వాళ్ళ అమ్మ పార్వతి దీపావళి పండుగకు బాలు, మీనాను ఇంటికి పిలుద్దామని వస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఎందుకు వచ్చావు అంటూ నిలదీస్తోంది. నీలాంటి వాళ్లు నా ఇంట్లో కాలు పెడితే మనశ్శాంతి ఇంట్లో నుండి పోతుందని అవమానిస్తుంది. దీంతో తన తల్లిని వెళ్లిపొమ్మని మీనా చెబుతోంది. ఈ విషయాన్ని గమనించడం సత్యం.. ఇంటికి వచ్చిన వారిని అవమానించి పంపించడం సంస్కారం కాదని ప్రభావతిపై అరుస్తాడు. పార్వతిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తాడు సత్యం. అలా ఇంట్లోకి వచ్చిన పార్వతి.. సత్యం యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటుంది. తాను దీపావళి పండుగకు మీనాను అల్లుడిని పిలవడానికి వచ్చానని చెబుతుంది. కానీ బాలు నేను రాను అని మొండిగా సమాధానం చెబుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రవి, శృతిలను పిలుద్దామని అంటుంది ప్రభావతి.. దానికి బాలు రచ్చ చేస్తాడు. రేపు ఏం జరుగుతుందో చూడాలి..