BigTV English

AP: ఏపీలో నైట్ వాచ్‌మెన్లు.. ఆలస్యంగా పింఛన్లు.. జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. కేబినెట్ కీలక నిర్ణయాలు

AP: ఏపీలో నైట్ వాచ్‌మెన్లు.. ఆలస్యంగా పింఛన్లు.. జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. కేబినెట్ కీలక నిర్ణయాలు
ap cabinate jagan

AP: ఏపీలో మళ్లీ కొత్త ఉద్యోగాలు సృష్టించింది సర్కారు. పాఠశాలల్లో 5,388 మంది నైట్‌ వాచ్‌మెన్‌ల నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీరికి నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నారు. జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో 45 అంశాలపై చర్చ జరగ్గా.. 15 అంశాలకు ఆమోదం లభించింది.


విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతం కావడంపై సీఎం జగన్‌ను మంత్రులను అభినందించారు. ఆస్కార్‌ అవార్డు సాధించిన నాటు నాటు పాట బృందానికి కేబినెట్‌ అభినందనలు తెలిపింది.

ఏప్రిల్‌ నెలలో పింఛన్లు 3వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 1న రిజర్వు బ్యాంకు సెలవు, 2న ఆదివారం కావడంతో.. 3న పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.


ఏపీ కేబినెట్‌లో ఆమోదించిన అంశాలు ఇవే..

–షెడ్యూల్‌ కులాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
–బీసీ కమిషన్‌, ఎస్టీ, మైనార్టీ, మహిళా కమిషన్‌ ఛైర్మన్ల పదవీ కాలం రెండేళ్లకు కుదిస్తూ చేసిన చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం
–ఏపీ మీడియా అక్రిడేషన్‌ నిబంధనల సవరణకు ఆమోదం
–ఏపీ పబ్లిక్ సర్వీసెస్ గ్యారెంటీ బిల్లుకు ఆమోదం
–2023-27 నూతన పారిశ్రామిక విధానానికి ఆమోద ముద్ర
–ఏపీ వాటర్ వేస్ బిల్లు
–అమలాపురం కేంద్రంగా అర్బన్ డెవలప్‌మెంట్‌లో 120 గ్రామాలు విలీనం
–ఏపీ లెజిస్లేచర్‌ సెక్రటరీ జనరల్ పోస్టు భర్తీ
–ఏపీ అడ్వొకేట్‌ వెల్ఫేర్ ఫండ్ చట్ట సవరణ
–ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం-1908 సవరణ
–ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ
–ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు – 2023 కు ఆమోదం
–జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంపు
–ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంపు
–ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్
–పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం
–దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులను పాలకమండలిలో సభ్యులుగా నియమించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం. కనీసం 100 పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు.

Pawan Kalyan : ఒంటరిగా పోటీకి వెనుకాడం.. పొత్తులపై జనసేనాని క్లారిటీ..

Kotamreddy : అసెంబ్లీలో కోటంరెడ్డి నిరసన.. నమ్మకద్రోహి అంటూ వైసీపీ కౌంటర్..

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×