BigTV English

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. క్లీన్ ఎనర్జీ పాలసీకి ఆమోదం..

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. క్లీన్ ఎనర్జీ పాలసీకి ఆమోదం..

AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చ జరుగింది. కేబినెట్‌ ముందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కొత్త పాలసీలకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.


ఏపీ క్లీన్‌ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీని రూపొందించింది. ఇవే కాకుండా ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, కొత్త ఎంఎస్‌ఎంఈ పాలసీపై కేబినెట్‌లో చర్చ కొనసాగుతోంది. 2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామికవేత్త అంశంతో నూతన ఎంఎస్‌ఎంఈ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీపై చర్చ సాగుతోంది.


Also Read: ఏపీలో సామాన్యులకు మద్యం పంట.. లిక్కర్ వ్యాపారులకు షాక్

వీటితో పాటు మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూకేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్‌ నియంత్రణ, ఉద్యోగ కల్పన, మంత్రుల కమిటీల నియామకంపై మంత్రివర్గంలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×