BigTV English

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి.. అధికారులు ఏం చేశారు ?

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి.. అధికారులు ఏం చేశారు ?

Vinesh Phogat: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై ఒలంపిక్స్‌లో అనర్హత వేటు పడటంతో యావత్ భారత అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇదిలా ఉంటే వినేశ్ బరువు తగ్గగానికి శ్రమించినా నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలోనే అసలు ఎందుకు ఇలా జరిగింది. రెజ్లింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయనే చర్చ కూడా మొదలైంది.


నిబంధనలు ఏం చెబుతున్నాయంటే ?

  • ఒలంపిక్స్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పురుషుల్లో 57-125 కిలోల బరువు మధ్య 6 కేటగిరీలు ఉంటాయి. మహిళల విషయానికి వస్తే ఈ విభాగంలో 50, 53, 62,68,76 కేజీల విభాగాలు ఉన్నాయి. వినేశ్ ఫొగాట్ ఇందులో 50 కిలోల కేటగిరిలో పోటీ పడుతున్నారు.
  • ఆయా కేటగిరిలకు చెందిన వారి యొక్క బరువును ఫైనల్స్ కు ముందు రోజు ఉదయం కొలుస్తారు. అన్ని బరువుల కేటగిరిలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహిస్తారు. వినేశ్ పోటీపడే 50 కిలోల బరువు కేటగిరిలో రెండు రోజుల పాటు టోర్నీ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె పోటీ పడే 50 కిలోల విభాగంలో పోటీలు మంగళ, బుధ వారాల్లో జరుగుతున్నాయి.

నేడు ఫైనల్స్ జరుగుతున్నాయి. క్రీడాకారులు తప్పనిసరిగా నిర్ణీత కేటగిరిలో బరువు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.


ఫొగాట్ విషయంలో జరిగింది ఇదే..

  • వినేశ్ ఫొగాట్ మంగళవారం రాత్రి సమయానికి 2 కిలోల అదనపు బరువు ఉన్నారు. దీంతో ఆమె రాత్రికి జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి నియంత్రించాలి అనుకున్నా కూడా 100 గ్రాముల బరువు మాత్రం తగ్గించుకోలేకపోయింది.
  • ఆమెకు కొంత సమయం ఇవ్వాలన్న భారత బృందం అభ్యర్థనను ఒలంపిక్స్ అధికారులు తిరస్కరించారు.
  • వినేశ్ గతంలో కూడా 53 కేజీల కేటగిరిలో పోటీ పడింది. అయితే క్రీడల్లో కూడా ఇది సర్వ సాధారణం. బాక్సింగ్, వెయిట్ లిప్టింగ్ వంటి క్రీడల్లో కూడా ఇలా ఆడతారు. వినేశ్ ఫొగాట్ బరువు తగ్గి దిగువ రెజ్లింగ్ కేటగిరిలో బరిలోకి దిగడం ఇదేం తొలి సారి కాదు. ఒలంపిక్ క్వాలిఫయర్ రౌండ్స్ లో కూడా స్వల్ప తేడాతో బరువును ప్రమాణాలన్ని ఆమె అందుకుంది.
  • బరువు ప్రమాణాలను అందుకునేందుకు ఆమె జుట్టు కత్తిరించుకోవడంతో పాటు రక్తం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆహారం కూడా తీసుకోకుండా ఆమె శిక్షణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.అధికారులు కుట్ర పూరితంగానే సమయం ఇవ్వలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

Related News

Tim David: సొంత దేశం వాళ్ళే ఛీ కొట్టారు.. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నాడు.. RCB ప్లేయర్ సక్సెస్ వెనుక కన్నీళ్లు

Sameer Rizvi : సమీర్ రిజ్వి అరాచకం… 9 సిక్సులు, 3 బౌండరీలతో రెచ్చిపోయాడుగా.. ఇదిగో వీడియో

Pro Kabaddi League 2025: నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్… తొలి వాచ్ తెలుగు టైటాన్స్ దే…టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలంటే

OLYMPICS 2036 : 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్.. కావ్య పాప, సంజీవ్ తో రేవంత్ భారీ ప్లాన్

Nivetha Pethuraj: టీమిండియా ప్లేయర్ తో రిలేషన్.. ఇప్పుడు మరో వ్యక్తితో !

Arjun Tendulkar : ఎంగేజ్మెంట్ తర్వాత… గుళ్ల చుట్టూ తిరుగుతున్న సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ.. సానియా జోష్యంలో దోషముందా?

Big Stories

×