AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కొత్త ఏడాదిలో తొలిసారిగా ఏపీ కేబినెట్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు హాజరయ్యారు. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. మొత్తం 14 అంశాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8వ తేదీన వైజాగ్ రానున్న విషయం పై సైతం కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధాని పర్యటనను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కూటమి నేతలందరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. గతంలో ప్రధాని పర్యటన ఖరారై రద్దయిన విషయం తెలిసిందే. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రధాని పర్యటన నాడు రద్దు జరిగింది. మరల జనవరి 8వ తేదీన ప్రధాని మోడీ వైజాగ్ కు రానున్న సందర్భంగా, భారీ భద్రతా చర్యలు చేపట్టాలని సైతం సీఎం సూచించారు.
అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి అంశాలపై సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఆర్డిఏ పరిధిలో రూ. 2700 కోట్ల పనులకు ఏపీకే ఆమోదం తెలపగా, అమరావతిలో రెండు ఇంజనీరింగ్ పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా తిరుపతి ఈఎస్ఐ వైద్యశాల ప్రస్తుతం 50 పడకల వైద్యశాలగా సేవను అందిస్తున్న నేపథ్యంలో, 100 పడకలుగా అభివృద్ధి చేయాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. అలాగే రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీకి మంత్రివర్గం ఆమోదం తెలుపగా, పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం డెవలప్‌మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ దక్కింది.
Also Read: Plane Spotted Tirumala: శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు.. తెరమీదికి మళ్లీ ఆ అంశం!
అమరావతిలో రెండు ఇంజనీరింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్, లేఅవుట్ల విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల పరిధిలోని లేఅవుట్ల అనుమతులను ఇప్పటినుండి మున్సిపాలిటీలకే అప్పగిస్తూ ఆర్డినేట్ చట్టంను సవరణ చేసే దిశగా కేబినెట్ భేటీలో ప్రతిపాదన జరిగింది. కొత్త ఏడాదిలో తొలిసారిగా జరిగిన కేబినెట్ భేటీకి హాజరైన మంత్రులు ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు సైతం శుభాకాంక్షలు తెలిపారు.
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
మొత్తం 14 అంశాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
పలు పరిశ్రమలకు భూకేటాయింపులు చేయాలని కేబినెట్ నిర్ణయం
ప్రధాని మోదీ టూర్‌పై కేబినెట్ లో చర్చ
జనవరి 8న వైజాగ్‌కు ప్రధాని మోదీ రాక https://t.co/14pKW5NnPD
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2025