Big Stories

AP Cabinet : ఉచితంగా 5 లక్షల ట్యాబ్స్, రూ.2750కు పెన్షన్ పెంపు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

AP Cabinet : ఏపీ క్యాబినెట్ ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకొంది. పెన్షన్, విద్యార్ధులకు ట్యాబ్స్, భూముల రీసర్వే, తితిదేలో ఛీఫ్ పీఆర్వో పోస్ట్, తదితర అంశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 21న రాష్ట్రత్యవాప్తంగా 8వ తరగతి విద్యార్ధులకు 5 లక్షల ట్యాబ్స్‌ను పంపిణీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది.

- Advertisement -

మరోవైపు ఇప్పుడిచ్చే పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.2750కి పెంచాలని కూడా క్యాబినెట్ తీర్మాణం చేసింది. జనవరి 1 నుంచి ఈ పెన్షన్ అందేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది. తాజా నిర్ణయం వల్ల 62.31 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. అన్ని ప్రభుత్వం స్కూల్స్‌లో వర్చువల్ లర్నింగ్, స్కూళ్లలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది.

- Advertisement -

కొత్తగా ఏర్పాటైన జిల్లాలో వైసీపీ పార్టీ కార్యాలయాల కోసం స్థల కేటాయింపుల పైనా నిర్ణయం తీసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్ స్టీల్ ప్లాంట్‌తో ఒప్పందం చేసుకునే నిర్ణయంపై కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టులను భర్తీ చేయడానికి కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News