E-Paper
Advertisement

CM Chandrababu: గ్యాస్ కష్టాలకు చెక్.. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక టెలీ కాన్ఫరెన్స్

CM Chandrababu: గ్యాస్ కష్టాలకు చెక్.. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక టెలీ కాన్ఫరెన్స్
Advertisement

CM Chandrababu: రాష్ట్రంలో నెలకొన్న ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో గ్యాస్ సరఫరా స్థితిగతులను క్షుణ్ణంగా సమీక్షించారు. గ్యాస్ కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో (West Asia) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి. దీని ప్రభావం రాష్ట్రంలోని ఎల్పీజీ సరఫరాపై పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. సరఫరా గొలుసులో తలెత్తే ఇబ్బందులను ఎప్పటికప్పుడు అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

అయితే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రస్తుత గ్యాస్ నిల్వలు, పంపిణీకి సంబంధించిన తాజా నివేదికను ముఖ్యమంత్రికి అందించారు. రాష్ట్రంలో సుమారు 1.61 కోట్ల డొమెస్టిక్ కనెక్షన్లు, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయని, రోజువారీ డిమాండ్‌కు అనుగుణంగా చమురు సంస్థలతో (HPCL, IOCL, BPCL) మాట్లాడుతున్నట్లు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థి్క శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రస్తుత గ్యాస్ నిల్వలు, పంపిణీకి సంబంధించిన తాజా నివేదికను ముఖ్యమంత్రికి అందించారు. రాష్ట్రంలో సుమారు 1.61 కోట్ల డొమెస్టిక్ కనెక్షన్లు, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయని రోజువారీ డిమాండ్ కు అనుగుణంగా చమురు సంస్థలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.

Advertisement

గ్యాస్ కొరత ప్రభావం హోటల్, రెస్టారెంట్ రంగంపై ఎక్కువగా కనిపిస్తుండటంతో, మంత్రి కేశవ్ గారు ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వాణిజ్య సిలిండర్ల వినియోగంలో పొదుపు పాటించాలని, అవసరమైతే మెనూలో మార్పులు చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు మళ్లించకుండా గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు.

అలాగే గ్యాస్ కొరతను సాకుగా చూపి బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లను విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టాలని, గ్యాస్ ఏజెన్సీలు పారదర్శకత పాటించేలా చూడాలని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు నిర్ణీత సమయంలో గ్యాస్ సిలిండర్లు అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన నొక్కి చెప్పారు.

Also Read: వారానికో స్కూల్లో ఎమ్మెల్యేల భోజనం.. టీచర్లే మొదట రుచి చూడాలి: మంత్రి లోకేష్

ప్రస్తుతానికి రాష్ట్రంలో తగినంత గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది ‘పానిక్ బుకింగ్స్’ చేయవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పాఠశాలలు, ఆసుపత్రులు వంటి అత్యవసర సేవలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘం (Nadendla Manohar, Payyavula Keshav, Atchannaidu) నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×