AP News : చంద్రబాబుకు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా పేరుంది. ముఖ్యమంత్రి అయిన ప్రతీసారి పాలనలో తనదైన మార్క్ చూపిస్తుంటారు. అందుకే విజనరీ సీఎంగా పేరుగాంచారు. గతంలో నా జన్మభూమి, ప్రజల వద్దకే పాలన, ఫైల్స్ క్లియరెన్స్, ఆకస్మిత తనిఖీలు, నీరు-మీరు, పచ్చదనం-పరిశుభ్రత, దోమలపై దండయాత్ర.. ఇలా అనేక ఆసక్తికర కార్యక్రమాలు చేపట్టారు. లేటెస్ట్ టర్మ్‌లోనూ మరో ఇంట్రెస్టింగ్ కార్యక్రమంతో ముందుకొచ్చారు. ఏపీలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ లేకుండా చేయాలని సంకల్పించారు. అక్టోబర్ 2 నుంచే ఆ పని ప్రారంభించబోతున్నారు.
ఆ ప్లాస్టిక్‌పై నిషేధం
ఒకేసారి రాష్ట్ర మొత్తం కాకుండా.. మొదట 17 మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌పై నిషేధం అమలు చేయనున్నారు. విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమహేంద్రవరం తదితర నగరాల్లో ప్రయోగాత్మకంగా చేసి చూసి.. వచ్చిన ఫలితాలను విశ్లేషించి.. ఆ తర్వాత ఏపీ మొత్తం ఆ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయాలనేది సర్కారు కార్యచరణ. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్‌కు బదులు ప్రత్యామ్నాయంగా క్లాత్‌తో చేసిన బ్యాగుల వినియోగాన్ని ఎంకరేజ్ చేస్తారు.
అలా చేస్తే..
ఇదేమంత చిన్న నిర్ణయం కాదు. ప్లాస్టిక్ బ్యాన్ అనేది అంత ఈజీగా అయ్యే పని కూడా కాదు. కానీ, చంద్రబాబు చేసి చూపిస్తానని పంతం పట్టారు. ఆయన అనుకున్నారంటే చేసేస్తారు. ఇప్పటికే తిరుమలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం ఉంది. అక్కడ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే, నగరాల్లోనూ అంతే సక్సెస్ చేయడం కాస్త కష్టంతో కూడిందే. అధికారులు బెదిరిస్తేనో, కేసులు, ఫైన్ల భయం చూపిస్తోనో సాధ్యమయ్యే విషయం కాదు. ప్రజల్లోనే చైతన్యం రావాలి. ప్లాస్టిక్ వాడొద్దనే స్పిరిట్ పెంపొందాలి. అప్పుడే పర్యావరణానికి, మనకు క్షేమం.
చంద్రబాబు బిగ్ టాస్క్
పలుచగా ఉండే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యమ డేంజర్. దళసరి ప్లాస్టిక్ అయితే వాటిని సేకరించడం, రీసైకిల్ చేయడం సులభం. అదే సన్నని డెలికేట్ ప్లాస్టిక్‌ను కలెక్ట్ చేయడం కష్టం. అది ఎక్కడికక్కడ పీస్ పీస్ అయిపోతుంది. గాల్లో ఎగిరిపోతుంది. ఎక్కడపడితే అక్కడ పడిపోతుంది. ఆ ముక్కలను ఏరలేం. మట్టిలో ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను తీస్తుంటేనే చినిగిపోతుంది. అందుకే సేకరించడం సాధ్యం కాదు. అలాగని అది భూమిలో కలిసిపోదు. డ్రైనేజీల్లో ఇరుక్కుపోతుంది. మురుగు నీటిని బ్లాక్ చేస్తుంది. నేలను కలుషితం చేస్తుంది. అందుకే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరం ఉంటేనే బెటర్. అది వాడకపోతేనే మంచిది. సీఎం చంద్రబాబు అందుకే టాస్క్‌ను తీసుకున్నారు. మరి, ఆచరణలో ఎలా ముందుకుపోతారో చూడాలి..
🚨Andhra Pradesh CM announced a complete ban on single use plastic in 17 cities across state from 2nd October. pic.twitter.com/PSnOTAbIfa
— Indian Infra Report (@Indianinfoguide) June 18, 2025