BigTV English

Gundeninda GudiGantalu Today episode: సంజయ్ దెబ్బకు మౌనిక షాక్.. మీనాకు ప్రభావతి వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode: సంజయ్ దెబ్బకు మౌనిక షాక్.. మీనాకు ప్రభావతి వార్నింగ్..

Gundeninda GudiGantalu Today episode January 6th : నిన్నటి ఎపిసోడ్ లో..  ప్రభావతి అనుకున్నట్లుగానే కూతురు పెళ్లి చేసింది. కానీ బాలు దెబ్బకు షాకైంది. నీలకంఠం కండిషన్ కు ఒప్పుకొని మౌనికను అత్తింటికి పంపిస్తారు. ఇక సువర్ణ మీనాకు భరోసా ఇస్తుంది నా కూతురు లాగా చూసుకుంటాను బాలుని జాగ్రత్తగా చూసుకో అనేసి మీనాతో అంటుంది. మౌనికను నీలకంఠం ఇంటికి తీసుకొని వస్తారు. ఇక బాలు తాగేసి గుడికి వెళ్తాడు. తన చెల్లెలు, తండ్రి అన్న మాటలను తలుచుకొని బాధపడతాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడతాడు. ఇంతలోనే ఓ స్వామీజీ వచ్చి.. మీ చేతిలో లేని వాటి గురించి అనవసరంగా ఆలోచించి బాధపడకు, పెళ్లిళ్లు అనేవి స్వర్గంలోనే నిర్ణయించబడతాయి. పెళ్లి అనేది ఆపాలనుకుంటే ఆగదు. అది పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు అని ఆ స్వామీజీ చెప్తాడు. ఆ రాక్షసుడుకి ఇచ్చి తన చెల్లిని పంపడం తనకి ఇష్టం లేదని బాలు బాధపడతాడు. ప్రతివాడు ఎప్పుడో అప్పుడు పరిస్థితులను బట్టి మారుతాడు. ఇక ఇంట్లోకి అడుగుపెట్టిన మౌనిక దేవుడ్ని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది. శాంతి పూజకు రెడీ చేయమని నీలకంఠం సువర్ణకు చెప్తాడు. సంజు నేను మీనా బాలుని వెతుక్కుంటూ గుడికొస్తుంది. మౌనిక కొట్టినందుకు బాధపడుతున్నారా? అని ప్రశ్నించగా బాలు సమాధానం చెబుతూ ఇంకా నాలుగు దెబ్బలు వేసినా తాను బాధపడే వాడిని కాదని వాడిని నమ్మి మోసపోయిందంటూ బాధపడతాడు. మీ చెల్లి నువ్వు ఎక్కడ ఆవేశపడి హంతకుడులా మారుతావో అనే భయంతోనే కొట్టింది. మీరు బాధపడకండి. అంతా సెట్ అవుతాయని సద్ది చెబుతుంది మీనా. అందరిలాగానే తన చెల్లి కూడా వాడి మాయలో పడి మోసపోయిందని బాలు బాధపడతాడు.. మౌనికను ఇంటికి తీసుకొని వెళ్తారు. బాలు తాగి గుడికి వెళ్తాడు. బాలు కోసం మీనా వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రతి సంసారంలో మంచి చెడులు, కోపం శాంతం వంటివి ఉంటాయి వాటిని సర్దుకుపోవడమే జీవితం అని చెబుతుంది. తాను అన్నిటిని భరిస్తానని మౌనిక సమాధానం ఇస్తుంది. సువర్ణ మాత్రం ఈ పిచ్చి పిల్లను ఈ దుర్మార్గుడు ఎలా బాధలు పెడతాడో అని భయపడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. బాలు కోసం వెతుక్కుంటూ వెళ్లిన మీనా నచ్చచెప్పి ఇంటికి తీసుకొని వస్తుంది.. ఇంట్లో వాళ్ళందరూ బాలు పై కోపంగా ఉంటారు. ప్రభావతి కనీసం మొహం కూడా చూడదు. ఇంట్లో ఉన్న అందరు బాలు పై కోపంగా ఉంటారు. సత్యం మాత్రం బాలు చేసిన దాన్ని తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. సత్యం చెప్పినా ప్రభావతి మాత్రం వినదు. ఇక ఇంట్లో అందరు బాధ పడతారు. అటు శోభనానికి నీలకంఠం అన్ని ఏర్పాట్లు చేస్తారు. పూజ చేయించి మౌనికను సువర్ణ గదిలోకి పంపిస్తుంది. అక్కడకు ఎంటర్ అవ్వగానే తాగడం చూసి షాక్ అవుతుంది. శోభనం గదిలో పాలు ఎందుకు పెగ్ పంచుకుందాం అంటాడు. సంజు నిజ స్వరూపం బయట పెడతాడు. మీ బాలుకు బుద్ది చెప్పాలనే నీ మెడలో తాళి కట్టానని చెప్తాడు. అసలు ప్లాన్ ఏంటి అనే దాన్ని గురించి మౌనికకు చెబుతాడు. శోభనం గదిలోకి కోటి ఆశలతో వచ్చిన మౌనికకు భారీ షాక్ తగిలింది..


ఈ ప్రపంచంలోనే నన్ను చూడగానే పూర్తిగా అర్థం చేసుకున్నది మీ అన్నయ్య ఒక్కడే. వాడి చేతులు కట్టేసి ఆడుకుంటుంటే అప్పుడు కదా నాకు మజా వచ్చేది. నీ మెడలో పసుపు తాడు కట్టేసి.. ఇక్కడికి లాక్కొచ్చాను. ఇక్కడ నీకు దెబ్బపడితే వాడు అక్కడ గిలగిలలాడాలి. నీకు రోజుకో శిక్ష వేస్తూనే ఉంటాను అని సంజు కోపంగా, ఉక్రోశంగా అంటాడు. అది చూసిన మౌనిక షాక్ అవుతుంది. పెళ్లి చూపుల్లో అంత మంచివాడిలా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఇలా అంటున్నాడేంటీ అని భయపడుతుంది.. ఇక సంజు కు ఏమైందని కంగారు పడుతుంది. తాగినప్పుడు జరిగిన గొడవ గురించి బాలు అన్నయ్యను తప్పుగా అనుకుంటున్నారని, నిజానికి బాలు అన్నయ్య చాలా మంచివాడని, నాకు ఏం కావొద్దనే మీతో అలా ప్రవర్తించాడని మౌనిక నచ్చజెబుతుంది. కానీ, సంజు వినడు. రోజుకో శిక్ష వేస్తాను అప్పుడే మీ బాలు అన్నయ్య బాధ పడతాడు అంటాడు.

బాలు ఇంకా ఇంటికి రాలేదని సత్యం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ, వాడిని ఇంటిలోకి రానిచ్చేది లేదు అంటుంది ప్రభావతి. ఇంతలోనే బాలుని తీసుకొని మీనా ఇంట్లోకి వస్తుంది. ఇక చెల్లెలు పెళ్లిని చెడగొట్టినవాడు. తన కుటుంబ పరువును రోడ్డుకీడ్చిన వాడు.. నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు అంటూ ప్రభావతి బాలుని ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని ఆర్డర్ వేస్తోంది. దీంతో బాలు.. నాకు ఏ దిక్కు లేదు. పెద్దవాడు కోటీశ్వరుల సంబంధం చేసుకున్నాడు. చిన్నవాడు వాడు కూడా లేచిపోయి కోటీశ్వరుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక చెల్లె కూడా కోటీశ్వరుల సంబంధం చేసుకుంది. నేను మాత్రం పూలు అమ్మే అమ్మాయిని చేసుకున్నా ఎటు పోలేనని చెప్తారు. కుటుంబ మర్యాద, బాధ్యతలు తెలియకుండా ప్రవర్తించేవాడు, నా ఇంట్లో ఉండను అవసరం లేదు అంటూ ప్రభావతి రెచ్చిపోతుంది. దీంతో మీనా ఆగ్రహంతో ఊగిపోతుంది. తన అత్త ప్రభావతి ఎదురు మాట్లాడుతూ.. నా మొగుడు ఏం తప్పు చేశాడు.మీ పెద్ద కొడుకు లాగా 40 లక్షలు తీసుకెళ్లి మోసం చేశాడా.. చిన్నవాడి లాగా తన స్వార్థం కోసం ఇంట్లో నుండి వెళ్లిపోయాడా.. తన తండ్రి కోసం తన జీవనాధారమైన కారణం అమ్మేసి ప్రాణాలు కాపాడాడు అంటుంది దీంతో అందరూ సైలెంట్ అవుతారు. సత్యం, నేను ఇంట్లోకి తీసుకెళ్ళమ్మా ఏదైనా తినిపించని చెప్తారు. మీనా భోజనం తీసుకెళ్తే తినడానికి బాలు ఇష్టపడడు. బలవంతంగా మీనా తినిపిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మౌనికను తీసుకొని వస్తానని బాలు బయలుదేరుతుంటాడు. ఏం జరుగుతుందో చూడాలి..


Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×