CM Jagan: తమ ఐదేళ్ల పాలనలో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీకువచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అందించిన అమ్మవడి పథకాన్ని గతంలో టీడీపీ ఎందుకు అమలు చేయలేదని చంద్రబాబును ప్రశ్నించారు.
పాయకరావు పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం తాము అములు చేస్తున్న పథకాలను టీడీపీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని వెల్లడించారు. నాడు నేడు, విద్యా కానుక, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, పిల్లలకు ట్యాబ్ లు, డిజిటల్ బోధన, ఫీజు రియింబర్స్ మెంట్ , విద్యాదీవెన, విద్యావసతి వంటి పలు సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 25 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందించామని, రైతన్నలకు పెట్టుబడి సాయం, రైతు బరోసా కేంద్రాల ద్వారా చేయూతను అందిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడా ఎటువంటి వివక్షత లేకుండా నేరుగా బటన్ నొక్కడం ద్వారా నగదును పంపిణీ చేస్తున్నామని జగన్ తెలిపారు.
గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.70 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమ చేశామని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతామని ఆరోపించారు. ప్రజల తరఫున తాను ఒక్కడినే పోరాటం చేస్తున్నానని.. అయితే ఎంత మంది ఏకమైనా సరే తనని ఏం చేయలేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: వైసీపీకి, జగన్‌కు పొలిటికల్ హాలిడేను ప్రకటించాలి: పవన్ కల్యాణ్
ల్యాండ్ అండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అండ్ కో ప్రజల్లో దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. దీని ద్వారా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. ఎవరి భూమిపై వారికే హక్కు ఉంటుందని తెలిపారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆయన పేరు చెబితే ఒక్క మంచిపనైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.