Ukraine’s Harry Potter castle on fire: దక్షిణ ఓడరేవు నగరమైన ఒడెసాలో హ్యారీ పోటర్ కటగా ప్రసిద్ధి చెందిన ఉక్రెయిన్ భవనంపై సోమవారం రష్యా క్షిపణి దాడి చేయడంతో కనీసం ఐదుగురు మరణించారు. వార్తా పోర్టల్ ది ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, గోతిక్ శైలిలో నిర్మించిన సుందరమైన స్థానిక మైలురాయి, ఒక ప్రైవేట్ న్యాయ సంస్థగా పనిచేస్తోంది. క్షిపణి దాడి తర్వాత ఈ భవనం మంటల్లో కాలిపోతున్నట్లు కనిపించింది.
వారాల వ్యవధిలో ఒడెసాపై అతిపెద్ద దాడుల్లో ఒకటిగా ఈ దాడిని పరిగణించవచ్చు. రష్యన్ దళాలు ఒడెసా నగరంపై క్షిపణులు, డ్రోన్లు బాంబులను ప్రయోగించాయి. ప్రముఖ సముద్రతీర ప్రాంతంలో ఉన్న విద్యా సంస్థను దెబ్బతీశాయి. ఒక గర్భిణీ స్త్రీ, నాలుగేళ్ల చిన్నారితో సహా కనీసం 32 మంది గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ కిపర్ టెలిగ్రామ్‌లో తెలిపారు.
ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ కిపర్ ప్రకారం, దాడిలో మరణించిన వారితో పాటు, దాడితో స్ట్రోక్‌కి గురై ఒక వ్యక్తి మరణించాడు. ఉక్రేనియన్ నావికాదళ ప్రతినిధి డిమిట్రో ప్లెటెన్‌చుక్, మిలిటరీ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఒక పోస్ట్‌లో, క్లస్టర్ వార్‌హెడ్‌తో కూడిన ఇస్కాండర్-ఎమ్ బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించారని.. ఆ క్షిపణులను అడ్డుకోవడం కష్టమని చెప్పారు.
Also Read: కొలంబియా వర్సిటీలో టెన్షన్, అదుపులో కొంతమంది..
తాజా దాడుల గురించి రష్యా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఒడెసా మేయర్ హెన్నాడి ట్రుఖానోవ్ రష్యా సముద్రం ఒడ్డున నడకకు వెళుతున్న వారిని షూట్ చేసి చంపేస్తోందని అన్నారు. “రాక్షసులు. మృగాలు. క్రూరులు.. ఇంకేం చెప్పాలో నాకు తెలియదు,” అని తెలిపారు.
25 నెలల క్రితం ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఓడరేవు నగరం ఒడెసా తరచుగా రష్యా క్షిపణి, డ్రోన్ దాడులకు గురి అవుతోంది.