BigTV English

YS Jagan Speech in Kuppam: కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చింది నేనే..: జగన్

YS Jagan Speech in Kuppam: కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చింది నేనే..: జగన్

 


cm ys jagan speech in kuppam public meeting

CM YS Jagan Speech in Kuppam Public Meeting(AP elections news): కుప్పం ప్రాంతానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జలాలు విడుదల చేశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.


కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ద్వారా నీళ్లు అందిస్తున్నామని తెలిపారు. 6,300 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని చెప్పారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4 లక్షలపైగా జనాభా దాహార్తిని తీరుస్తున్నామన్నారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో రూ.560 కోట్ల వ్యయంతో చేపట్టామన్నారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తి చేశామని తెలిపారు.

చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా? అని జగన్ ప్రశ్నించారు. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది తానేనని స్పష్టం చేశారు. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చానని తెలిపారు. రెవెన్యూ డివిజన్‌ ఇచ్చింది తానేని చెప్పుకొచ్చారు. చిత్తూరు పాల డెయిరీని పున:ప్రారంభించానన్నారు.

Read More: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. నూజివీడులో విజయంపై ధీమా..

కుప్పంలో చంద్రబాబు హయాంలో 31వేల మందికి మాత్రమే పెన్షన్‌ ఇచ్చారని జగన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 45,974 మందికి పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. ఈ నియోజకవర్గంలో 44,640 మంది రైతులకు రూ.241 కోట్లు రైతు భరోసా ఇచ్చామని వివరించారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 1400 మంది వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని తెలిపారు. కుప్పంలో 15,727 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు.  మరో 15వేల ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

Related News

Helicopter ambulance: ఏపీలో హెలికాఫ్టర్ అంబులెన్స్ వస్తోంది.. అంతా ఉచితమే.. సర్వీస్ ఎలాగంటే?

Pulivendula Slips: బ్యాలెట్ బాక్స్ లో ఓటుతోపాటు స్లిప్పులు కూడా.. పులివెందుల ఓటర్ల మనోగతం ఏంటంటే?

AP Heavy Rains: ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

Polavaram: పోలవరంపై కీలక అప్ డేట్.. మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్

Fact Check AP: అడ్డంగా ఇరుక్కున్న అంబటి? బిగ్ షాకిచ్చిన fact check!

AP Heavy rain alert: అల్పపీడనం ఆగ్రహం.. మూడు రోజులు భీకర గాలులు, జోరు వర్షాలు.. ఎక్కడంటే?

Big Stories

×