BigTV English

Mohan Babu Warning: మోహన్ బాబు మాస్ వార్నింగ్.. నా పేరు రాజకీయంగా ఉపయోగిస్తే..!

Mohan Babu Warning: మోహన్ బాబు మాస్ వార్నింగ్.. నా పేరు రాజకీయంగా ఉపయోగిస్తే..!


Mohan Babu Warning to Political Leaders: టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాడు. ఆయన కుమారుడు మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీని మోహన్ బాబు దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రముఖ మోడల్ ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తుంది.


అలాగే ఈ మూవీలో మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయనతోపాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి నటులు ఇందులో భాగం కానున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మోహన్‌బాబు సోషల్ మీడియా ద్వారా ఓ నోట్‌ని పంచుకున్నారు.

READ MORE: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై దర్శకుడు క్రేజీ అప్డేట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

తన పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నారని.. ఏ పార్టీ వారైనా తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ (ఎక్స్)లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది.

దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టిపెట్టాలి గాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం.

నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను’’ అని మోహన్ బాబు ఆ నోట్‌లో రాసుకొచ్చారు.

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×