BigTV English

Jagan: జగన్ ర్యాలీలను నిషేధించాలి? ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి

Jagan: జగన్ ర్యాలీలను నిషేధించాలి? ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి

Jagan: జగన్ ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోందా? ఈ విషయంలో రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి మొదలైందా? ఆ వ్యవహారంపై కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఒకవేళ నిషేధం పెడితే న్యాయస్థానాల నుంచి అనుమతి తెచ్చుకోవాలని జగన్ అండ్ కో ప్లాన్ చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఏడాది తర్వాత జనంలోకి వెళ్లడం మొదలుపెట్టారు వైసీపీ అధినేత జగన్. ఆయన జిల్లాలకు వెళ్లిన ప్రతీసారి ఏదోవొక హంగామా క్రియేట్ చేస్తున్నారు. శాంతి భద్రతల ఇష్యూని క్రియేట్ చేయడం, కేడర్ రెచ్చగొట్టడం చేయడం చేస్తున్నారు. చివరకు కేడర్, నేతలు చేసిన పనులను ఆయన సమర్థించుకోవడం జరుగుతోంది.

జగన్ టూర్లలో జరిగిన.. జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది కూటమి సర్కార్.  పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ వాటిని ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దాని ఫలితమే ముగ్గురు మృతికి జగన్ పల్నాడు టూర్ కారణమైంది. దీనికి కారణమెవరు? మాజీ సీఎం జగన్ కారణమా? లేక పోలీసులా? కూటమి సర్కార్‌దా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి.


ఈ ఘటన తర్వాత పోలీసులు చేయాల్సిన వన్నీ చేస్తున్నారు. విచారణకు నోటీసులు ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన జగన్ వాహనాన్ని సీజ్ చేశారు. రేపో మాపో ఆయన్ని విచారణకు పిలవనున్నారు పోలీసులు. విచారణ మాట కాసేపు పక్కనబెడితే.. రేపటి రోజున జగన్ టూర్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనేది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: అఖండ గోదావరి ప్రాజెక్టుకు శ్రీకారం, రెండేళ్లలో పుష్కరాలు

ఇదే క్రమంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు పర్యటనలో పోలీసుల సూచనలను పాటించకుండా జగన్ ముమ్మాటికీ తప్పు చేశారని అంటున్నారు. 100 మందికి పర్మిషన్ ఇస్తే వేలాది మందిని అక్కడికి రప్పించడానికి కారణమేంటని ప్రశ్నించారు.

జగన్ షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో ఓ వ్యక్తి కారు టైరు కింద పడిపోయారు, ఇది ముమ్మాటికీ యాక్సిడెంటేనని అంటున్నారు. టైరు కింద పడిన వ్యక్తిని లాగి పడేసి జగన్ కాన్వాయ్ ముందుకు సాగిన తీరుని ఆమె తప్పబట్టారు. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారని దుమ్మెత్తిపోశారు.

2018లో జగన్ వ్యవహరశైలిని ఇక్కడ గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు. ఆనాడు రోడ్ షోల విషయంలో అంబులెన్సు వస్తే వాటికి దారి ఇవ్వాలని ప్రజలను ఆయన కోరిన విషయాన్ని గుర్తు చేశారు. పదవి పోయిన తర్వాత జగన్ వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో జగన్ టూర్లపై నిషేధం విధించాలనే ఆలోచన కొందరి పోలీసు అధికారుల్లో మొదలైంది. దీనిపై కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్రభుత్వం నిషేధం విధించినా, న్యాయస్థానం నుంచి వైసీపీ నేతలు ఉత్తర్వులు తెచ్చుకునే అవకాశముందని అంటున్నారు.

అప్పుడు న్యాయస్థానం టర్న్స్ అండ్ కండీషన్స్ పెడుతుందని, ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాల్సిందేనని అంటున్నారు. ఒకవేళ వాటిని అధిగమిస్తే న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇస్తుందని కొందరు అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు అసలు చర్చ.

 

Related News

Amaravati Capital: అమరావతి మునిగిందంటూ ప్రచారం.. నారాయణ నష్టనివారణ చర్యలకు ఫలితం ఉంటుందా?

Duvvada Srinivas: ఎమ్మెల్యే కూన రవికుమార్-సౌమ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్, సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ

Aruna Arrest: పోలీసుల అదుపులో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ, ఉలిక్కిపడిన అధికారులు, నేతలు

Amaravati Crda office: అమరావతి సీఆర్డీఏ ఆఫీసు.. కళ్లు చెదిరేలా లోపల దృశ్యాలు

Bhogapuram Airport: వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు.. మహానాడుకు ముందే రాకపోకలు, బీచ్ కారిడార్‌పై ఫోకస్

New Bar Policy: గుడ్ న్యూస్..! ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు భారీ తగ్గుంపు..

Big Stories

×