Akhanda Godavari Project: ఏపీలో కూటమి సర్కార్ టూరిజంపై దృష్టి సారించింది. ఈ రంగం బలోపేతం చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రానుంది. అందుకే టూరిజం శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. తాజాగా రాజమండ్రి వేదికగా గురువారం అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ ప్రాజెక్టు వివరాలేంటి? అనేదానిపై ఓ లుక్కేద్దాం.
చారిత్రక నగరంగా పేరు పొందింది రాజమండ్రి అలియాస్ రాజమహేంద్రవరం. ఈ ప్రాంతం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా సిటీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అందంగా తీర్చిదిద్దేందుకు ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కింద రూ.94.44 కోట్ల రానుంది. రాజమహేంద్రవరంలో పుష్కరాల రేవు, హేవలాక్ వంతెన, గోదావరి మధ్యలో వినోద కేంద్రంగా మార్చనుంది. మరో రెండేళ్ల అంటే 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న ప్రాజెక్టు ఇది.
నదీ తీరంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలు, అంశాలను హైలైట్ చేయడం అందులో కీలకమైంది. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రవాణా, హోటళ్లు, చేనేత రంగాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తోంది.
ALSO READ: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. యువత అకౌంట్లలో రూ. 36 వేలు
వీటితోపాటు కాకినాడ బీచ్, కొల్లేరు సరస్సు, శక్తి పీఠాలను పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు తరలివస్తారని అంచనా వేస్తోంది. గోదావరి పుష్కరాలంటే గుర్తొచ్చేది రాజమండ్రి పుష్కరాల రేవు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దనుంది.
ఘాట్‌లో ఉన్న ఆలయాల విశిష్టత తెలియజేసేలా ఏర్పాట్లు చేయడం, గోదావరి హారతి ఇచ్చేలా అందంగా తీర్చిదిద్దుతారు. అంతేకాదు ఆధ్యాత్మిక, యోగా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. హేవలాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
వంతెనను 12 మీటర్ల వరకు వెడల్పు చేసి నగర, రాష్ట్ర చరిత్ర, విశిష్టతలు, కళా రంగాలు వంటి వివిధ థీమ్‌లతో అభివృద్ధి చేయనున్నారు. వంతెనపై 10 స్టాల్స్, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు, సెల్ఫీ, వ్యూ పాయింట్లు ఉండనున్నాయి.