BigTV English

AP Congress : ఏపీలో కాంగ్రెస్ దూకుడు.. నేడు మేనిఫెస్టో కమిటీ భేటీ..

AP Congress : ఏపీలో కాంగ్రెస్ దూకుడు.. నేడు మేనిఫెస్టో కమిటీ భేటీ..
AP Congress News

AP Congress News(AP politics):

ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేగంగా అడుగులు వేస్తోంది. ఇవాళ ఆంధ్రరత్న భవన్ లో మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించనుంది. పల్లంరాజు అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. అన్ని పార్టీల కంటే ముందుగా మేనిఫెస్టో ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది. ప్రత్యేకహోదా, విభజన హామీలు, సీపీఎస్ రద్దు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేతతో పాటు పలు సంక్షేమ పథకాలను మేనిఫేస్టోలో పెట్టేలా సూచనలు కమిటీ చేయనుంది.


మరోవైపు.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు కలిశాయి. తమ సమస్యలను వివరిస్తూ మేనిఫెస్టోలో అంశాలను పెట్టాలని కోరారు. తెలంగాణ తరహాలో గ్యారెంటీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కమిటీ నివేదకను షర్మిల పరిశీలించనున్నారు. మార్పులు చేర్పుల అనంతరం ఏఐసీసీకి మేనిఫెస్టో నివేదక అందజేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే మేనిఫెస్టో ఫైనల్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలలో రాహుల్ గాంధీ చేత మేనిఫెస్టో, హమీలపై ప్రకటన చేయించాలని ఏపీసీసీ నేతలు భావిస్తున్నారు.

AP Congress, Apcc chief Ys Sharmila, Congress manifesto committee,


Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×