BigTV English

Governor Quota MLCs Oath : ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఇష్యూ.. స్పందించిన మండలి ఛైర్మన్ గుత్తా..

Governor Quota MLCs Oath : ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం ఇష్యూ.. స్పందించిన మండలి ఛైర్మన్ గుత్తా..
Political news in Telangana

Governor Quota MLCs Oath(Political news in telangana):

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకార అంశం ఉత్కంఠగా మారింది. సోమవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్లిన ఇద్దరు నేతలకూ నిరాశ ఎదురైంది. రెండు గంటలపాటు కౌన్సిల్​ హాల్‌లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోసం వేచి చూశారు. అయితే.. దీనిపై స్పందించిన కోదండరాం.. తాము మండలి ఛైర్మన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వెళ్లామని చెప్పారు. ఈనెల 31న ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించాలని సందేశం పంపినట్లు సమాచారం.


తాను అందుబాటులో లేననే అంశంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్ మాత్రమే ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాల్సిందిగా తనను అడిగారని.. 31న మధ్యాహ్నం మూడున్నర గంటలకు వస్తానని చెబితే తాను అంగీకరించానని తెలిపారు. మిగతా ఎమ్మెల్సీతోనూ అదేరోజు ప్రమాణం చేయించేలా ఏర్పాట్లు చేయాలని తాను అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కోదండరాం, అమీర్ అలీఖాన్ సమాచారం ఇవ్వకుండానే ప్రమాణం కోసమంటూ తన కార్యాలయానికి వచ్చారని సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. మండలి ఛైర్మన్‌గా తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.


Tags

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×