E-Paper
Advertisement

ఏపీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 338 ఉద్యోగాలు..అప్లికేషన్ గడువు పెంపు

ఏపీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 338 ఉద్యోగాలు..అప్లికేషన్ గడువు పెంపు
Advertisement

AP Cooperative Bank Recruitment 2026: బ్యాంకింగ్ ఉద్యోగార్థులకు ఏపీ ప్రభుత్వం, కోఆపరేటివ్ బ్యాంకులు ఒక అద్భుతమైన గుడ్‌న్యూస్‌ను అందించాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో (DCCB) ఉన్న మొత్తం 338 అసిస్టెంట్ మేనేజర్ , స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ, వయోపరిమితి,ఎంపిక విధానం,పరీక్ష ఫీజు వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీలు, అర్హతల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 338 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం, విజయనగరం, కడప, విశాఖపట్నం ఏపీసీఓబీ (APCOB) పరిధిలో అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Advertisement

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

Advertisement

స్థానికత: అభ్యర్థి ఏ జిల్లాకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో.. కచ్చితంగా ఆ జిల్లాకు చెందిన స్థానికులై ఉండాలి. అలాగే ఇంగ్లీష్ కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు స్థానిక భాషలో మంచి ప్రావీణ్యం ఉండడం తప్పనిసరి.

ఎంపిక విధానం:

ఈ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ రాత పరీక్షను నిర్వహించనున్నారు. రాత పరీక్షలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫైనాన్స్ అవేర్నెస్, కంప్యూటర్ పరిజ్ఞానం నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 200 మార్కులకు గాను 200 ప్రశ్నలు ఉండి, 120 నిమిషాల సమయం కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 (0.25) మార్కు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ ఆన్‌లైన్ రాత పరీక్షను రాబోయే ఆగస్టు లేదా సెప్టెంబరు నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 590 కాగా.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 826 ఉంటుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Related News

రప్పా రప్పా నాటకాలకు చెక్ పెడతాం.. వైఎస్ జగన్‌పై హోం మంత్రి అనిత ఫైర్!

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్.. షాకైన ఏపీ ప్రభుత్వం

వైద్యురాలి తలపైకి కారు ఎక్కించి.. రాజమండ్రిలో దారుణం, మాల్‌లో యువకులు అఘాయిత్యం

విజయవాడలో ఉద్రిక్తత.. బోండా ఉమా – మల్లాది విష్ణు వర్గాల తోపులాట.. డీఎస్సీ దీక్షలో హై టెన్షన్!

అంబటి చుట్టూ కేసుల ఉచ్చు.. ఈసారి ఏం జరిగిందంటే, కేంద్రమంత్రి టార్గెట్‌గా

బెల్ట్ షాప్ మురళి హత్య కేసులో సంచలనం.. ప్రత్యక్ష సాక్షిని కిడ్పాప్ చేసిన ముఠా!

కాకినాడ జిల్లాలో ఘోరం.. రిజర్వాయర్‌లో పడి యువకుడు గల్లంతు

Big Stories

Advertisement
×