Wall clock showing wrong time: ఇంట్లో గోడ గడియారం టిక్.. టిక్.. అంటూ సక్రమంగా తిరుగుతుంటేనే.. ఆ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్లు. కానీ.. ఏ క్షణాన ఆ గడియారం సమయం తప్పు చూపడం ప్రారంభిస్తుందో, ఆటోమేటిక్‌గా మన పనులన్నీ.. అస్తవ్యస్తం అయిపోతుంటాయి. చాలా మందికి.. ఎదురయ్యే సాధారణ సమస్య ఏటంటే, గడియారం నెమ్మదించడం లేదా సమయం వెనక్కి వెళ్లడం.వెంటనే..సెల్‌లో పవర్ అయిపోయి ఉంటుందని భావించి కొత్త బ్యాటరీ తెచ్చి మారుస్తాం.అయినప్పటికీ సమస్య అలానే ఉంటే..అసలు లోపం ఎక్కడ ఉందో ఈ కింద తెలిపిన విషయాల ద్వారా తెలుసుకుందాం.
బ్యాటరీ మార్చినప్పటికీ గడియారం సరిగా పని చేయకపోతే.. దాని లోపలి గేర్ల మధ్య దుమ్ము లేదా చిన్న నూనె కణాలు పేరుకుపోయి ఉండొచ్చు. గడియారం ఎక్కువ కాలం వాడటం వల్ల లేదా గాలి తగిలి దాని స్ప్రింగ్స్ బలహీనపడటం వల్ల వేగంతో తిరగలేవు. ఇలాంటి సమయంలో క్లాక్‌ను ఓపెన్ చేసి సున్నితంగా డస్ట్ క్లీన్ చేస్తే సరి పోతుంది.
కొన్నిసార్లు బ్యాటరీని అమర్చే స్ప్రింగ్ లేదా టెర్మినల్స్ దగ్గర తుప్పు పట్టడం జరుగుతుంది. దీని వల్ల బ్యాటరీ నుంచి పవర్ సరిగ్గా మోటార్‌కు అందదు. కాబట్టి.. బ్యాటరీ మార్చే ముందు ఆ స్ప్రింగ్ భాగాలను ఒక సారి పొడి క్లాత్ తో లేదా కాటన్ తో శుభ్రం చేయండి. చిన్న లూజ్ కనెక్షన్ ఉన్నా గడియారం ఆగి పోతుంది.
వర్షా కాలంలో లేదా .. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు గడియారం లోపలి సూక్ష్మ భాగాలు పడిపోవడం జరుగుతుంది.ముఖ్యంగా .. ప్లాస్టిక్ లేదా చెక్కతో చేసిన గడియారాల మోటార్‌లపై తేమ ప్రభావం పడి సూదులు ఒక దాని కొకటి తగులుకుంటూ ఆగిపోతుంటాయి.
Also Read: ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్
ఒకవేళ మీ గడియారం పూర్తిగా.. పాడై పోయి రిపేర్‌కు రాని పక్షంలో, కొత్తది కొనే ముందు.. లోపలి మెకానిజం మార్చి ప్రయత్నించండి. దీని వల్ల మీ పాత గడియారానికి కొత్త ప్రాణం పోయొచ్చు. అనవసరంగా.. కొత్త గడియారాలపై డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.
ఇకపై మీ ఇంట్లోని గడియారం తప్పు సమయం చూపితే .. వెంటనే కంగారుపడి బ్యాటరీలు పారేయకండి. ఈ చిన్న ట్రిక్స్ , చెకింగ్ పద్ధతులను ఫాలో అవ్వండి. తద్వారా.. మీ సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది!