Tanveer Ahmed On IND VS JAP: జపాన్‌ను ఓడించేందుకే కింద మీద పడ్డారు..మీరు పాకిస్తాన్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ టీమిండియాపై తన్వీర్ అహ్మద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పొద్దున లేస్తే చాలు, టీమిండియాపై విమర్శలు చేసే తన్వీర్ అహ్మద్.. తాజాగా జపాన్ తో జరిగిన టీ20 సిరీస్ పై స్పందించారు. జపాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా చెత్తగా ఆడిందన్నారు. పసికూన జపాన్ జట్టును ఓడించేందుకు నానా కష్టాలు పడ్డారని పరువు తీశారు. వరల్డ్ నెంబర్ జట్టుగా ఉన్న టీమిండియా వరుసగా టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలు గెలుచుకుందని, కానీ జపాన్ పై గెలిచేందుకు చాలా ఇబ్బంది పడిందని సెటైర్లు వేశారు. వాళ్ల ఆటతీరు చూస్తే, 150 కోట్ల భారతీయులు అసహ్యించుకున్నారని బాంబ్ పేల్చారు. ఫ్లాట్ ట్రాక్స్ అయితేనే ఆడతాము, లేకపోతే తోక ముడుస్తామన్నట్టుగా టీమిండియా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. విదేశీ ట్రాక్ లపై టీమిండియా, భవిష్యత్తులోనూ ఏ మ్యాచ్ గెలవబోదన్నారు. జపాన్ చేతిలో ఘోర పరాజయం నుంచి బయట పడిన టీమిండియా భవిష్యత్తు అంధకారమే అంటూ వార్నింగ్ ఇచ్చారు.
టీమిండియా వర్సెస్ జపాన్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, వైభవ్, సంజు శాంసన్, ఇషాన్ ఇరగదీస్తారని సోషల్ మీడియా ప్రచారం చేశారని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సెటైర్లు పేల్చారు. కానీ మ్యాచ్ రోజున మాత్రం వైభవ్ ను పక్కకు పడేశారన్నారు. మిగతా వాళ్లు మా వల్ల కాదు బాబోయ్ అన్నట్టుగానే బ్యాటింగ్ చేశారని విమర్శలు చేశారన్నారు. అభిషేక్ శర్మ మరోసారి డకౌట్ అయి, చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఆఫ్ఘానిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ లో సెంచరీతో ఇరగదీసిన అభిషేక్ శర్మ, జపాన్ లాంటి చిన్న జట్టు బౌలర్లకు బెంబేలెత్తిపోయాడని పరువు తీశారు. దీంతో మరోసారి ఫ్లాట్ ట్రాక్స్ హీరోగా పేరు తెచ్చుకున్నాడని చురకలు అంటించారు. వీళ్లు ఇలాగే ఆడితే, 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని బాంబ్ పేల్చారు.
జపాన్, అఫ్ఘానిస్తాన్ కాదు, పాకిస్తాన్ పై టీమిండియా గెలిచి చూపించాలని తన్వీర్ అహ్మద్ సవాల్ విసిరారు. పాత గొడవలు, దేశ భద్రత విషయాలను పక్కకు పెట్టి…పాకిస్తాన్ పర్యటనకు టీమిండియా రావాలని ఆహ్వానించారు. పాకిస్తాన్ లో ఒక్క మ్యాచ్ ఆడి, గెలిస్తే.. టీమిండియాను మెచ్చుకుంటానని ఛాలెంజ్ విసిరారు. లేదా దుబాయ్ వేదికగానైనా తేల్చుకుందామన్నారు. అక్కడకు రాకుంటే, ఏసియన్ గేమ్స్, 2027లో మాత్రం టీమిండియాను వదిలేది లేదంటూ హెచ్చరించారు తన్వీర్ అహ్మద్.