George Krish Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఛార్మింగ్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శర్వానంద్ (Sharwanand) విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరోసారి విభిన్నమైన షేడ్స్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే జార్జ్ క్రిష్ (George Krish). ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల (Sreenu vaitla) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని 2027 అనగా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇకపోతే నేడు శ్రీను వైట్ల పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం ఆయనకు స్పెషల్ విషెస్ తెలియజేస్తూ.. సినిమా నుండి ఫస్ట్ బూస్టర్ పేరిట అదిరిపోయే అప్డేట్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ బూస్టర్ లో శర్వానంద్ రెండు విభిన్నమైన గెటప్లలో కనిపించారు. ఒకవైపు జార్జ్ గా, మరొకవైపు క్రిష్ గా విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇందులో శర్వానంద్ సరసన హీరోయిన్ గా మిస్ ఇండియా మానస వారణాసి (Manasa Varanasi) ని ఎంపిక చేశారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ బూస్టర్లో వీరిద్దరి జోడి చాలా కొత్తగా, ఫ్రెష్ గా కనిపించింది. ఇక తెరపై వీరి ఫ్రెష్ జోడీకి మంచి మార్కులు పడతాయి అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే తాజాగా విడుదల చేసిన ఈ ఫస్ట్ బూస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పాలి.
మానస వారణాసి విషయానికి వస్తే.. 2020 మిస్ ఇండియా పోటీలలో విజేతగా నిలిచిన ఈమె.. తొలిసారి అశోక్ గల్లా హీరోగా నటించిన ‘దేవకీ నందన వాసుదేవా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోకపోయినా.. సహజ నటనతో, సాంప్రదాయ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సంతోష్ శోభన్ తో కలిసి ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందించింది. కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మానసకి ఈ సినిమాలో అవకాశం లభించడం ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.
also read: ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఒకప్పుడు ఆనందం, దూకుడు, వెంకీ , ఢీ, సొంతం, రెడీ, బాద్ షా, దుబాయ్ శీను ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన ఈయన.. కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈసారి తనదైన మార్క్, కామెడీ పంచులు, పక్కా కమర్షియల్ హంగులతో జార్జ్ క్రిష్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాతో టాలీవుడ్ కి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు కూడా.. శమరి ఈ సినిమాతో ఆయనకు ఎలాంటి సక్సెస్ లభిస్తుందో చూడాలి.