Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. తప్పు తన వాళ్లు చేసినా సహించని వ్యక్తిత్వం తనదంటూ మరో మారు పవన్ నిరూపించారు. ఈ నేపథ్యంలో జనసైనికులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ ఇంతలా సీరియస్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారో తెలుసుకుందాం.
ఇటీవల ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సాధించిన విషయం తెలిసిందే. ఎవరైనా వివాదాస్పద కామెంట్స్ చేసినా, మహిళల వ్యక్తిగత హననానికి దారి తీసేలా మార్ఫింగ్ వంటి చర్యలకు పాల్పడినా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ లింగ్ పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే పలువురు వైసీపీ నేతలు తమ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు మాజీ సీఎం జగన్ ఈ విషయంపై మాట్లాడుతూ.. తమ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని, మరి టీడీపీ జనసేనకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అలాగే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ సైతం అరెస్టులు పర్వాన్ని స్వాగతిస్తూనే, ఏ పార్టీ వారైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా జనసైనికులు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ముందస్తుగా జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాను బాధ్యతగా సమాజానికి ఉపయోగకరంగా వినియోగించాలని, పార్టీ విధానాలను ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జనసైనికులు సోషల్ మీడియాను ఉపయోగించాలని సూచించారు. అలాగే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ఒంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని, అటువంటి కామెంట్స్ ను జనసేన విభాగం ఎప్పుడు పరిశీలిస్తుందన్నారు.
ఇతర పార్టీ రాజకీయ నాయకులపై కానీ, సినీ నటులపై, ఏ ఇతర అంశాలపై కానీ అసభ్యకర పదజాలం, మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం, షేర్ చేయడం అంటే చర్యలకు పాల్పడితే చట్టబద్ధమైన నేరానికి పాల్పడినట్లుగా భావించాల్సి వస్తుందన్నారు. పార్టీ ముసుగులో ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చెత్త పనమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులపై వివాదం సాగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తమ పార్టీ సోషల్ మీడియా సైనికులకు హెచ్చరికలు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.