Virat Kohli Son: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవాల్టి మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. తాజాగా విరాట్ కోహ్లీ కొడుకు ఆకాయి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అనుష్క శర్మ… తన కుటుంబంతో పెర్త్ స్టేడియానికి వచ్చింది.
Also Read: IND vs Aus 1st test: విరాట్ కోహ్లీ సెంచరీ.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కుమారుడు ఫోటోలు లీక్ అయ్యాయి. అనుష్క శర్మ పక్కన ఎవరో ఒక వ్యక్తి విరాట్ కోహ్లీ కొడుకును ఎత్తుకొని ఉన్నారు. అయితే… మ్యాచ్ కు సంబంధించిన కెమెరాలలో విరాట్ కోహ్లీ కొడుకు ముఖం స్పష్టంగా కనిపించింది. ఆ ఫోటోలలో అచ్చం విరాట్ కోహ్లీ లాగానే అతని కొడుకు ఉన్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: IPL Auction 2025: రేపే వేలం.. అందరికన్ను ఈ వికెట్ కీపర్లపైనే.. పంత్ పై కోట్ల వర్షం గ్యారెంటీ?