Big Stories

AP EAPCET Results: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

AP EAPCET Results 2024: ఏపీలో ఇంజనీరంగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాలు వెలువడ్డాయి. మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్ నిర్వహించగా.. ఇటీవల ప్రాథమిక కీ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అధికారులు ఫలితాలను కూడా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.39 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసారు. ఈఐపీసెట్ ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఆధారంగా ర్యాంకులను ఇచ్చారు.

- Advertisement -

ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ గుంటూరు జిల్లాకు చెందిన మాకినేని జిష్ణు సాయి సాధించగా.. సెంకండ్ ర్యాంక్ సాయి హశ్వంత్ రెడ్డి, థర్డ్ ర్యాంక్ భోగళ్లపల్లి సందేశ్ సాధించారు. ఫార్మసీలో ఫస్ట్ ర్యాంక్  శ్రీశాంత్ రెడ్డి, సెంకండ్ ర్యాంక్ పూల దివ్య తేజ, థర్డ్ ర్యాంక్ వడ్లపూడి ముఖేష్ సాధించారు.

- Advertisement -

Also Read: PM Modi with Pawan, Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం, అరుదైన ఘట్టం వెనుక…

ఏపీ ఈఏపీసెట్ – 2024 పరీక్షను కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3, 62, 851 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. అందులో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈఏపీసెట్ ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు వీటిపై మే 26 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఆధారంగా మంగళవారం ర్యాంకులను ప్రకటించారు.

విద్యార్థులు ఫలితాలు, స్కోర్ కార్డును https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News