Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న అర్నబ్ తుపాను సృష్టించిన నష్టంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తుపాను దాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు, జరిగిన తీవ్ర నష్టాన్ని నేరుగా పరిశీలించేందుకు వెంటనే కేంద్ర బృందాలను పంపాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు.
రూ. వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు..
ఈ తుపాను వల్ల ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యానవన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సీఎం లేఖలో పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగిపోగా, 10,450 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా, గాలుల ధాటికి 180 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, తూర్పు-పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాలపై తీవ్రంగా పడింది.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
తుపాను హెచ్చరికలతో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశమని చంద్రబాబు తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి 28,000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్, 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిరంతరం శ్రమిస్తున్నాయి.
విద్యుత్, రహదారుల పునరుద్ధరణపై దృష్టి
గాలుల తీవ్రతకు రహదారులపై 220కి పైగా చెట్లు, అనేక విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రవాణా, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం శిథిలాలను తొలగించి, విద్యుత్ , తాగునీటి సరఫరాను పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు సీఎం వివరించారు.
తుపాను ప్రభావంపై కేంద్ర హోంమంత్రికి చంద్రబాబు లేఖ
అర్నబ్ తుపాను ప్రభావంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకి లేఖ రాసిన ఏపీ సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయని వెల్లడి
తుపాను నష్టంపై అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని కోరిన సీఎం… pic.twitter.com/0e5pHN8dbE— BIG TV Breaking News (@bigtvtelugu) October 28, 2026
కేంద్ర సహాయం కోరిన ముఖ్యమంత్రి
రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రంతో పాటు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పనిచేస్తున్నాయని సీఎం తెలిపారు. తుపాను నష్టంపై సమగ్ర నివేదికను త్వరలోనే కేంద్రానికి సమర్పిస్తామని, అప్పటివరకు నష్టాన్ని స్వయంగా అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపాలని అమిత్ షాను కోరారు. అలాగే, ఏపీకి నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
Also Red: కరువు పై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగిస్తాం!- చానగాని దయాకర్