BigTV English

AP Election Results 2024, TDP Leads in Kadapa: వైసీపీ కంచుకోట బద్దలు, కడపలో ఫ్యాన్ కుదేలు, 8 సీట్లలో కూటమి జోరు

AP Election Results 2024, TDP Leads in Kadapa: వైసీపీ కంచుకోట బద్దలు, కడపలో ఫ్యాన్ కుదేలు, 8 సీట్లలో కూటమి జోరు

AP Election Results 2024, TDP Leads in Kadapa: ఆంధ్రప్రదేశ్ శాసన‌సభ ఎన్నికల పోలింగ్ వేళ సీఎం జగన్ సొంత జిల్లా కడప ఎన్నికల పరిస్థితి ఏంటి? వైసీపీ తన హవా కొనసాగుతుందా? వైఎస్ షర్మిల దెబ్బకు ఫ్యాన్ పార్టీ కకావికలమైందా? కూటమి జోరుకు వైసీపీ కంచుకోట బద్దలవుతుందా? ఇవే ప్రశ్నలు చాలామంది వెంటాడుతున్నాయి.


కడప జిల్లా గురించి చెప్పనక్కర్లేదు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి జిల్లాను కంచుకోటగా మార్చుకున్నారు. అక్కడ మూడింట రెండొంతులు సీట్లు గెలుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ.

పునాదులు బలంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ షర్మిల రూపంలో పెద్ద దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది. తాజాగా కడప నుంచి అందుతున్న సమాచారం మేరకు ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం పది సీట్లకు గాను 8 సీట్లలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా దాదాపు 10 వేల మెజార్టీ కూటమి అభ్యర్థులు కొనసాగుతున్నారు. బద్వేలు, పులివెందుల మాత్రమే వైసీపీకి ఎగ్జ్ ఉన్నట్లు సమాచారం.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×