BigTV English

Kadiyam Kavya: వరంగల్‌లో కడియం కావ్య ముందంజ

Kadiyam Kavya: వరంగల్‌లో కడియం కావ్య ముందంజ

Warangal Parliament Segment Congress Candidate Kadiyam Kavya lead: పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ ఫలితాలన్ని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రజలు మార్పును కోరుకుంటూ అధికార పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టినట్లు ఈ ఫలితాలను చూస్తుంటే అర్ధమవుతోంది. అందులో భాగంగానే వరంగల్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది.కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య లీడ్‌లో ఉండగా, బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వెనుకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మారపల్లి సుధీర్‌ కుమార్ మూడవస్థానానికి పడిపోయి బీఆర్ఎస్‌ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు.ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కడియం కావ్య అందరి అంచనాలను తిప్పికొడుతూ అనూహ్యంగా లీడ్‌లో ఉంది.


ఇక ముందు నుంచి బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుస్తాడని భావించిన బీజేపీ అధిష్టానం టికెట్‌ ఇచ్చి బరిలో దించింది. అంతేకాకుండా గతంలోనూ బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉండటంతో మరింత ప్లస్ అవుతుందని భావించిన బీజేపీకి షాక్ తగిలే ఛాన్స్‌లు మెండుగా కనిపిస్తున్నాయి.ఇక బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మారంపల్లి సుధీర్ కుమార్‌ మూడవస్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ ఫలితాలతో ఇక బీఆర్‌ఎస్ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయనే చెప్పుకోవాలి.

ఇదిలా ఉంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ తరువాత రెండవ పెద్ద జిల్లాగా వరంగల్‌కి పేరుంది.ఈ నేపథ్యంలో వరంగల్‌లో ఇలాంటి రిజల్ట్స్‌ రావడం పట్ల చాలామంది బీఆర్‌ఎస్‌కి ఇకపై కష్టతరమే అని భావిస్తున్నారు.ఇకపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాతుకుపోనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి కూతురిగా, డాక్టర్‌గా ఎన్నో సేవలు అందించి ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా కడియం కావ్యకి పాజిటివ్ టాక్‌ ఉంది.అందుకే వరంగల్ ఓటర్లంతా తనకు భారీ మెజార్టీ ఇచ్చారని టాక్‌. అందులోనూ వరంగల్ జిల్లా లోకల్‌ క్యాండిడేట్‌గా, గతంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్‌పై వరంగల్ వ్యాప్తంగా నెగటివ్‌తో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మారపల్లి సుధీర్‌ కుమార్ కొత్త అభ్యర్థి కావడంతో కడియం కావ్యకి ప్లస్ అయ్యిందనే చెప్పాలి. అందుకే ఇప్పటివరకు పూర్తయిన 6 రౌండ్లలో కడియం కావ్య లీడ్‌లో ఉంది.


Tags

Related News

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Big Stories

×