E-Paper
Advertisement

Team India Pace Bowling: టీమ్ ఇండియా..పేస్ బౌలింగు వీక్ గా ఉందా?

Team India Pace Bowling: టీమ్ ఇండియా..పేస్ బౌలింగు వీక్ గా ఉందా?
Advertisement

India team cricket news(Latest sports news today): టీ 20 ప్రపంచకప్ ముందు క్రికెట్ అభిమానులు అందరూ సంతోష సంబరాల్లో ఉన్నారు. అయితే ఒకొక్క సంగతి నెట్టింట బయటపడుతుంటే గుండె గుభేల్ మంటోంది. దీంతో పేపర్ పులులుగా పేరున్న మన టీమ్ ఇండియా ఆటగాళ్లు ఏం చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. మన బౌలింగు అత్యంత వీక్ గా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే ఐపీఎల్ లో చూశాం కదా అంటున్నారు. నిజానికి ఐపీఎల్  లో  ఆడే జట్లలో విదేశీ ప్లేయర్లు తక్కువగా ఉంటారు. లోకల్ ఆటగాళ్లు ఎక్కువగా ఉంటారు. టీమ్ ఇండియాకి ఆడేవాళ్లు ఒకరిద్దరు మాత్రమే ప్రతి జట్టులో ఉంటారు. ఒక్క ముంబై ఇండియన్స్ లోనే నలుగురు వరకు ఉన్నారు.

Advertisement

ఇప్పుడు టీ 20 ప్రపంచకప్ పోటీలకు వెళ్లిన బౌలర్లందరినీ.. ఐపీఎల్ లో కుర్రాళ్లు ఉతికి ఆరబెట్టారు. అదే ఇప్పుడు తలచుకుని అందరూ కంగారుపడుతున్నారు.

ఇంతకీ టీమ్ ఇండియాలో ఉన్న పేస్ బౌలర్లు ఎవరంటే.. మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ముగ్గురిపై కూడా అంత నమ్మకం లేదు. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడిపైనే ఆశలున్నాయి. 20 ఓవర్లు తను కాయలేడు కదా అంటున్నారు. తనకి సపోర్టు కావాలి.

Advertisement

Also Read: టీమ్ ఇండియాలో స్టార్లు ఉండి ఏం లాభం: బ్రియాన్ లారా

అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్ లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో ఆకట్టుకున్నాడు. కానీ ఓవర్ కి 10పైనే పరుగులు ఇచ్చుకున్నాడు.

మహ్మద్ సిరాజ్ ఎప్పుడెలా ఆడతాడో ఎవరికీ తెలీదు. ఐపీఎల్ లో ఆర్‌సీబీ తరఫున 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. కానీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఫస్టాఫ్ లో అయితే సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. టీమ్ ఇండియాలో ఏసీ-డీసీ ఆటగాడిలా మారిపోయాడు.

హార్దిక్ పాండ్యా అటు బౌలింగు, ఇటు బ్యాటింగ్ రెండింటా ఓటమి పాలయ్యాడు. కాకపోతే పేస్ ఆల్ రౌండర్ లేకపోవడం, విదేశీ పిచ్ లపై మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో అవకాశం వచ్చింది. శివమ్ దుబె ఉన్నాడు కానీ, బ్యాటింగు వరకే ఐపీఎల్ లో పరిమితం అయ్యాడు.

యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లతో స్పిన్ విభాగం మాత్రం కొంచెం పర్వాలేదన్నట్టు ఉంది. కానీ ఇందులో ఇద్దరు మాత్రమే ఆడేందుకు అవకాశం ఉంది. ఒక్క బ్యాటింగ్ లైనప్ మాత్రమే బలంగా ఉంది. అందువల్ల టీమ్ ఇండియా ఎంతవరకు నెట్టుకువస్తోందనని అప్పుడే అనుమానలు మొదలయ్యాయి.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×