BigTV English

Nara Lokesh as a Minister: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్

Nara Lokesh as a Minister: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్

Nara Lokesh takes Charge as a Minister: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకరం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, తదితర మంత్రులు బాధ్యతలు స్వీకరించి ఆయా శాఖల కార్యకలాపాలపై దృష్టి సారించారు. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సచివాలయం నాలుగో బ్లాక్ రూం నంబర్ 208లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు ఫైళ్లను పరిశీలించారు. కాగాచ ఆయన సచివాలయానికి వచ్చే సమయంలో పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌కు టీడీపీ నేతలు, అధికారులు అభినందనలు తెలిపారు.

కాగా, ఏపీ మంత్రివర్గం సైతం ఉదయం తొలిసారిగా భేటీ అవుతోంది. ఇందులో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్‌లో చేర్చాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా జులై చివరివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్‌పై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read: అభియోగాలు, ఆరోపణలు.. పార్టీ ఆఫీసుల చుట్టూ ఏపీ రాజకీయం

అయితే ఇప్పటివరకు నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టకపోవడానికి కారణం ఆయన ఛాంబర్‌లో స్వల్ప మార్పులు, చేర్పులు చేయడంతో ఆలస్యమైనట్లు తెలుస్తోంది. నిన్నటివరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉంటూ విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Related News

Free Electricity In AP: తెలంగాణ బాటలో ఏపీ సర్కార్.. వారందరికీ ఉచిత విద్యుత్

Smart Ration cards: ఏపీలో ప్రారంభమైన స్మార్ట్‌ రేషన్ కార్డుల పంపిణీ

Jagan Tour: జగన్ తిరుమల పర్యటన.. మళ్లీ డిక్లరేషన్ లొల్లి, నో అంటున్న వైసీపీ

AP DSC verification: ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్‌ వాయిదా.. రాత్రి ప్రకటన వెనుక

AP New Scheme: సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్.. కోటి వరకు, వారంతా ఆనందంలో

CM Progress Report: 51వ CRDA సమావేశం.. అమరావతి డెవలప్‌మెంట్‌కు ఎన్ని కోట్లు అంటే..!

Big Stories

×