BigTV English

AP Political Party Offices: అభియోగాలు, ఆరోపణలు.. పార్టీ ఆఫీసుల చుట్టూ ఏపీ రాజకీయం..!

AP Political Party Offices: అభియోగాలు, ఆరోపణలు.. పార్టీ ఆఫీసుల చుట్టూ ఏపీ రాజకీయం..!

AP Political around the Party Offices: ఏపీలో ప్రస్తుత రాజకీయం పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ.. రాజప్రాసాదాలను తలపించేలా పార్టీ భవనాలు నిర్మించారని టీడీపీ ఆరోపిస్తుంటే.. అనుమతులు లేకుండా అడ్డగోలుగా టీడీపీ భవనాల నిర్మాణాలు చేపట్టినట్లు వైసీపీ అభియోగాలు మోపుతోంది.


జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజాధనంతో.. ప్రభుత్వ భూముల్లో ఎన్నో భవనాలు నిర్మించారు. వాటిని పార్టీ ఆఫీసులుగా మార్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. అనుతుల్లేకుండా.. పార్టీ కార్యాలయాల పేరిట నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేసింది.

తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావచ్చిన బిల్డింగ్‌ను కూల్చేసిన నేపథ్యంలో.. మిగతా జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇస్తున్నారు. ఏలూరు నడి బొడ్డున కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వైసీపీ కార్యాలయం ప్యాలెస్‌ని తలపించేలా నిర్మించడంతో.. జిల్లా వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు కర్నూలులోని వైసీపీ కార్యాలయ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. చిత్తూరు జిల్లా గంగవరంలో శ్రీలంక కాలనీవాసులకు కేటాయించిన స్థలంలో దౌర్జన్యంగా పార్టీ ఆఫీసును నిర్మించారు. అటు మచిలీపట్నంలో 2 ఎకరాల్లో స్థలం కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి.


Also Read: ఇదేం తలనొప్పి.. జగన్ ప్రామిస్, త్వరలో..

జిల్లాల విభజన తర్వాత వేలకు వేలకు ఖర్చుపెట్టి ప్రభుత్వ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ కార్యాలయాలు మాత్రం ప్రభుత్వ భూముల్లోనే దర్జాగా కట్టుకోవడంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రభుత్వ భూమినే వైసీపీకి కట్టబెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఉదయం 10 గంటలకు తొలి కేబినెట్ భేటీ జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న కేబినెట్‌ భేటీ కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 8 శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రం విడుదలకు సంబంధించి ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన ఐదు హామీలపై తొలి సంతకం చేసిన బాబు.. నేడు వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Deputy CM Pawan kalyan: క్యూ ఆర్ కోడ్‌తో డిప్యూటీ సీఎంకు సలహాలు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం.. దీనిపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం మంత్రివర్గానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీకి ఉన్న అప్పులపై కొత్త ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది. గత ప్రభుత్వం అప్పులు ఎలా తెచ్చింది? వేటికి ఖర్చు చేసింది? ఆ నిధులన్నీ ఏం చేశారు? అనేదానిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించే ఛాన్స్ కనిపిస్తుంది.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపై కేబినెట్లో చర్చించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాబు.. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Big Stories

×