BigTV English

AP Government: సంక్రాంతి వరాలు ప్రకటించిన ప్రభుత్వం..పెండింగ్ బకాయిలు విడుదల

AP Government: సంక్రాంతి వరాలు ప్రకటించిన ప్రభుత్వం..పెండింగ్ బకాయిలు విడుదల

రూ.6,700 కోట్ల బకాయిల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్
నేటి నుంచి లబ్దిదారుల అకౌంట్లలో జమ కానున్న నిధులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, చిన్న కాంట్రాక్టర్లకు,
విద్యార్థులకు టీడీపీ కూటమి సర్కార్ సంక్రాంతి కానుక
ఎన్టీఆర్ వైద్యసేవ బకాయిలు చెల్లించేందుకు రూ.400 కోట్లు
పెండింగ్‌లో ఉన్న మరికొన్ని బిల్లులు, బకాయిలు విడుదల
ఉండవల్లిలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై చర్చ
మీడియాకు వివరాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి పయ్యావుల


AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. వివిధ వర్గాలకు చెందిన బిల్లులు, బకాయిలు రూ.6,700 కోట్ల విడుదలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిధులన్నీ ఆదివారం నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో జమ కానున్నాయి. శనివారం ఉండవల్లిలో ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లు, అమరావతి రైతులకు కౌలు సంక్రాంతి కానుకగా బిల్లులు, బకాయిలను చంద్రబాబు ప్రకటించారు.

సమీక్ష అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ బిల్లుల్లో ఎవరికెంత? అని వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదలపై రాష్ట్ర 3 గంటల పాటు సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. మొత్తం రూ.6,700 కోట్లలో ఉద్యోగుల జీపీఎఫ్, సరెండర్ లీవ్, సీపీఎస్ బకాయిలు రూ.1300 కోట్లు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. జీపీఎఫ్ బకాయిలు రూ.519 కోట్లు, పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు రూ.214 కోట్లు, సీపీఎస్ బకాయిలు రూ.300 కోట్లు, టీడీఎస్ బకాయిలు రూ.265 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటించారు.


ఎన్నెన్నో తీపి కబుర్లు
6.50 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఎస్సీ ఎస్టీ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.788 కోట్లు, విద్యుత్ శాఖ రాయితీ బకాయిలు రూ.500 కోట్లు, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ బకాయిలు రూ.400 కోట్లు, డ్రగ్స్, మెడిసిన్స్ బకాయిలు రూ .100 కోట్లు విడుదల చేస్తున్నట్లు పయ్యావుల తెలిపారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఎంతో మంది చిన్నచిన్న కాంట్రాక్టర్లు కనీసం రూ.5 నుంచి 10 లక్షల లోపు బిల్లులు కూడా అందకుండా పలు ఇబ్బందులు గురవుతున్నారన్నారని, ఆ విధంగా ఇబ్బంది పడుతున్న 26 వేల మందికి లబ్ధి చేకూర్చే విధంగా రూ.586 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

651 ఎంఎస్ఎంఈలకు, మరో 6,651 మంది మైక్రో ఎంటర్‌ప్రిన్యూర్లకు లబ్ది చేకూర్చే విధంగా రూ.90 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తున్నామని పయ్యావుల ప్రకటించారు. అదేవిధంగా అమరావతి రాజధానికి, గన్నవరం ఎయిర్‌ పోర్టుకు భూములిచ్చిన రైతుల కౌలు బకాయిలు రూ.241 కోట్ల చెల్లింపునకు విడుదల చేస్తున్నట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు.

అహర్నిశలు శ్రమిస్తున్నాం..
‘ గత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి చిన్నాభిన్నం అయ్యింది. ఆ పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టిపెట్టాం. ఒకవైపు రూ .10 లక్షల కోట్ల బకాయిలు, వాటిపై ప్రతిరోజూ వడ్డీ చెల్లించడంతోపాటు మరో రూ.1.30 వేల కోట్ల బకాయిల ఒత్తిడి ప్రభుత్వంపై ఉంది.

వీటికి తోడు గత ప్రభుత్వం 60: 40 వాటాతో అమలు చేయాల్సిన 94 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి, కేంద్ర వాటాను పొంది రాష్ట్ర వాటాను చెల్లించకపోవడం వల్ల ఆ పథకాలన్నీ నిలిచిపోవడం జరిగింది. ఇందుకు సంబంధించి రూ.6వేల కోట్లను కేంద్రానికి జమచేసి 73 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం’ అని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.

ప్రజల సంతోషం కోసమే..
‘ సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో వివిధ వర్గాలకు మేలు చేసేలా ఆర్థికపరమైన నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు, పోలీసు సిబ్బందికి బకాయిలు చెల్లించేందుకు రూ.6,700 కోట్లు విడుదల చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు, అనేక సవాళ్లు ఉన్నా కూడా వారికి మేలు చేయాలనేదే ఈ ప్రయత్నం. నిధుల విడుదలకు తీసుకున్న ఈ నిర్ణయం లక్షల మంది ఇళ్లల్లో సంతోషాన్ని తెస్తుంది. పండుగ పూట వారి ఆనందం మాకు అత్యంత సంతృప్తిని ఇస్తుంది. ప్రతి వర్గానికి మేలు చేసేలా నిరంతరం శ్రమిస్తామని, ప్రజల సంతోషం కోసం ప్రతిక్షణం పనిచేస్తాం’ అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎంకు లోకేశ్ థ్యాంక్స్
‘కంసమామ మోసం చేసి పోతే మన చంద్రన్న న్యాయం చేస్తున్నారు. జగన్ రెడ్డి ఫీజు బకాయిలు పెట్టి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారు. ఆయన పెట్టిన బకాయిలు ప్రజా ప్రభుత్వం తీర్చాలని రోడ్డెక్కిన ఘనత కూడా ఆయనకే దక్కింది. గత పాలకులు చేసిన పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను విద్యా శాఖ మంత్రి అయిన వెంటనే కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. దశల వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం అని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రూ.788 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం. పండుగ వేళ విద్యార్థులకు తీపి కబురు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు’ అని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×