BigTV English

Game Changer Day 2 Collections : ‘ గేమ్ ఛేంజర్ ‘ కలెక్షన్ల జోరు.. రెండు రోజులకు ఎన్నికోట్లంటే..?

Game Changer Day 2 Collections : ‘ గేమ్ ఛేంజర్ ‘ కలెక్షన్ల జోరు.. రెండు రోజులకు ఎన్నికోట్లంటే..?

Game Changer Day 2 Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్.. భారీ అంచాలతో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10 న థియేటర్ల లోకి వచ్చింది.. మొదటి రోజు నుంచి మిక్సీ్డ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ కలెక్షన్స్ మాత్రం ఊపందుకున్నాయి. ఒక్క రోజులోనే 186 కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా కలెక్షన్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. రెండో రోజు కలెక్షన్స్ పై మేకర్స్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ వరల్డ్ వైడ్ గా 250 కోట్లు దాటినట్లు తెలుస్తుంది.. ఈ మూవీ మిక్స్ డ్ రివ్యూలు, మౌత్ టాక్‌ సొంతం చేసుకుంది. అయినప్పటికీ తొలి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది గేమ్ ఛేంజర్. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ మూవీ పేరే వినిపిస్తుంది. ఇక రెండు రోజులకు బాక్సాఫీస్ టార్గెట్ ను రీచ్ అయ్యిందో లేదో తెలుసుకుందాం..


రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అది భారీ డిజాస్టర్ అయ్యింది. దాదాపు మూడేళ్లకు వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ అంచనాలను పెంచేసింది. డైరెక్టర్ శంకర్ గత సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. ఈ మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించగా.. అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.. మొత్తం ప్రమోషన్స్ తో కలిపి 500 కోట్లు ఖర్చు చేశారు. మొదటి రోజు 220 కోట్లతో రిలీజ్ అయ్యింది. కానీ అంత రాబట్టలేదు. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా కేవలం 186 కోట్లు సాధించిన సంగతి తెలిసిందే. రెండో రోజు కలెక్షన్స్ పై ఆసక్తి మొదలైంది. రెండో రోజు ఎన్ని కోట్లతో రాబట్టిందో చూద్దాం..

గేమ్ ఛేంజర్ మూవీ ఇండియాలో తొలి రోజు రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలిపింది. ఇందులో తెలుగు నుంచి రూ. 41.24 కోట్లు రాగా.. హిందీ బెల్ట్‌లో రూ. 7.5 కోట్లు, కర్ణాటకలో 10 లక్షలు, తమిళంలో 2.12 కోట్లు, మలయాళంలో 3 లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది.. మొత్తంగా 186 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. రెండో రోజు కూడా కలెక్షన్స్ పెరిగినట్లు తెలుస్తుంది. రెండో రోజు గేమ్ చేంజర్ ఇండియాలో రూ. 12.33 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు అయినట్లు తెలుస్తుంది. నైట్ షోలకు రెస్పాన్స్ బాగుంటే.. కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. కానీ, ఎలా ఉన్నా.. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ల్లో పెరుగుదల కనిపించింది. వీకెండ్ కావడంతో ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని టాక్.. ప్రస్తుతం 250 కోట్ల గ్రాస్ ను అందుకుందని టాక్.. మరి ఎన్ని కోట్లు రెండో రోజు వసూల్ చేసిందో తెలియాలంటే గేమ్ ఛేంజర్ ప్రకటన కోసం వెయిట్ చెయ్యాల్సిందే..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×