BigTV English

OTT Movie : హర్రర్ మూవీస్ లోనే అరుదైన సినిమా… ఈ మాస్టర్ పీస్ ను మిస్సైతే రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిందే

OTT Movie : హర్రర్ మూవీస్ లోనే అరుదైన సినిమా… ఈ మాస్టర్ పీస్ ను మిస్సైతే రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిందే

OTT Movie : ఫ్యామిలీ డ్రామా, డీమన్ ట్విస్ట్‌ తో ఒక సూపర్‌నాచురల్ హారర్-థ్రిల్లర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా స్టోరీ ఒక మాన్షన్ లో జరుగుతుంది. చివరివరకూ ఉత్కంఠంగా సాగుతుంది. హారర్, సర్వైవల్ మూవీస్ ఇష్టపడేవాళ్ళకి ఇది తప్పక చూడాల్సిన సినిమా. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


హులులో స్ట్రీమింగ్

‘The Inheritance’ 2024లో విడుదలైన అమెరికన్ హారర్-థ్రిల్లర్ సినిమా. దీన్ని అలెజాండ్రో బ్రుగ్వెస్ డైరెక్ట్ చేశారు. బాబ్ గంటన్ (చార్లెస్ అబెర్నాథీ), పేటన్ లిస్ట్ (కామి), బ్రియానా మిడిల్టన్ (హన్నా), రాచెల్ నికోల్స్ (మాడలిన్), ఆస్టిన్ స్టోవెల్ (డ్రూ), డేవిడ్ వాల్టన్ (సీ.జె.) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 జూలై 12న థియేటర్లలో విడుదలైంది. హులు (Hulu), జియో హాట్ స్టార్ (Jio hotstar)లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా IMDbలో 4.7/10, Rotten Tomatoesలో 32% రేటింగ్ ను కలిగిఉంది.


స్టోరీలోకి వెళితే

బిలియనీర్ చార్లెస్ అబెర్నాథీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా, మీడియా మొగల్స్ అయిన ట్విన్స్ సీ.జె., మాడలిన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కామి, చారిటీ హెడ్ డ్రూ తన మాన్షన్‌కి ఆహ్వానిస్తాడు. వీళ్లంతా చార్లెస్ వారసులే. కాకపొతే అతనికి దూరంగా జీవిస్తుంటారు. డ్రూ తన భార్య హన్నా కూడా తీసుకొస్తాడు. అయితే చార్లెస్ బ్లడ్ రిలేటివ్స్ మాత్రమే రావాలని చెప్పడంతో, హన్నా రావడం ట్విన్స్‌కి నచ్చదు. ఇక్కడ చార్లెస్ ఒక షాకింగ్ విషయం చెబుతాడు. ఈ రాత్రి అర్ధరాత్రి ఏదో తనను చంపబోతోందని, కాబట్టి తన పిల్లలు తనను కాపాడాలని ఒక హాకింగ్ ట్విస్ట్ ఇస్తాడు. అతన్ని కాపాడితే వాళ్లకి సమానంగా సంపద వస్తుంది. లేకపోతే అంతా అబెర్నాథీ ఫౌండేషన్‌కి వెళ్తుంది. ఇక మాన్షన్ లాక్‌డౌన్ అవుతుంది. సెక్యూరిటీ, స్టాఫ్‌ని పంపేసి, అందరూ లోపల ఇరుక్కుంటారు.

కొద్దిసేపటికే కామి వైన్ సెల్లార్‌లో వింత శబ్దం విని భయపడుతుంది. ఇక ఆ మాన్షన్‌లో గందరగోళం స్టార్ట్ అవుతుంది. ఆస్థికోసం ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభిస్తారు. మరో వైపు వీళ్లందరిని ఒక దురుద్దేశంతోనే చార్లెస్ పిలిచి ఉంటాడు. అతనికి ఒక డీమన్ తో ఒప్పందం ఉంటుంది. దాని కోసమే వాళ్ళను ఆహ్వానిస్తాడు. ఇంతకీ చార్లెస్ ఉద్దేశం ఏమిటి ? అతన్ని ఎవరు చంపాలనుకుంటున్నారు ? ఆ మాన్షన్‌లో అసలేం జరుగుతుంది ? వీళ్లంతా ప్రాణాలతో బయటపడతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : స్వర్గం చూపిస్తానని చెప్పి అమ్మాయిలతో ఇదేం పని ? యానిమల్స్ కన్నా డేంజర్ ఈ సైకో… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

OTT Movie : మనుషుల్ని వెంటాడి చంపే నీడ… పిచ్చెక్కించే ట్విస్టులు… మతిపోయే మిస్టరీ థ్రిల్లర్

Big Stories

×