Hari Hara Veera Mallu movie: దాదాపు రెండేళ్లు విరామం తర్వాత స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటించిన మూవీ హరిహర వీరమల్లు ఫిల్మ్ దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ ఆయనకు శుభకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.
పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై స్పందించారు సీఎం చంద్రబాబు. ఆ సినిమా గురించి ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ‘‘పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న #HariHaraVeeraMallu చిత్రం విడుదల సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు.
మిత్రులు పవన్ కళ్యాణ్ గారు… చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన ‘హరిహర వీరమల్లు’ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ ఫిల్మ్ అన్నివర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.
అదే సమయంలో ‘ధర్మం కోసం యుద్ధం ప్రారంభం’ అనే స్లోగన్‌తో ఉన్న ఆ ఫిల్మ్ పోస్టర్‌ను చంద్రబాబు పంచుకున్నారు. అటు మంత్రి లోకేష్ కూడా పవన్ మూవీపై ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ‘‘మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు తెలిపారు.
పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’. అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ALSO READ: రైతులకు బిగ్ అలర్ట్.. లక్ష మందికిపైగా అన్నదాత స్కీమ్ వర్తించదు
ఉన్నట్లుండి సీఎం చంద్రబాబు.. పవన్ కల్యాణ్ మూవీపై ఎక్స్ వేదికగా మనసులోని మాట బయటపెట్టడంపై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నార్మల్‌గా సినిమాల గురించి ఏనాడూ సీఎం చంద్రబాబు స్పందించిన దాఖలాలు లేవని అంటున్నారు. తొలిసారి ఆయన గురించి ఎక్స్ వేదికగా ప్రస్తావించడం హ్యాపీగా ఫీలవుతున్నారు.
సీఎం చంద్రబాబు తన సినిమాపై స్పందించడంపై పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో గత పదేళ్లలో పలుమార్లు సమావేశమైనా ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష– ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు.. చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు శ్రీ @ncbn గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో గత పదేళ్లలో పలుమార్లు సమావేశమైనా ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష– ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే… https://t.co/NXeSlrAuNR
— Pawan Kalyan (@PawanKalyan) July 23, 2025
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో… pic.twitter.com/NP9rw3eZkR
— Lokesh Nara (@naralokesh) July 23, 2025