BigTV English

AP Disha PS: దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్పు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు

AP Disha PS: దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్పు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు

Disha Police Stations Name Changed by AP Government: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో.. మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించిన సమస్యలపై ఈ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసేలా, సమస్యలను పరిష్కరించుకునేలా వీటిని అందుబాటులోకి తెచ్చారు. తాజాగా.. వాటి పేర్లను మారుస్తూ కూటమి మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.


హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ఏడాది జూన్ లోనే ఈ విషయాన్ని వెల్లడించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన అనిత.. త్వరలోనే రాష్ట్రంలో ఉన్న దిశ పోలీస్ స్టేషన్ల పేర్లను మారుస్తామని తెలిపారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. మాజీ సీఎం జగన్ తీసుకున్న ఒక్కో నిర్ణయానికి, ప్రవేశపెట్టిన ఒక్క పథకానికి పేర్లు మారుస్తూ, గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పథకాలను పునరుద్ధరిస్తున్నారు. ఇటీవలే రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించారు. 2014 నుంచి 2019 వరకూ టీడీపీ హయాంలో ఏయే పథకాలున్నాయో మళ్లీ ఒక్కొక్కటిగా వాటిపేర్లనే పెడుతోంది కూటమి ప్రభుత్వం.


2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. పాత ప్రభుత్వం పెట్టిన పథకాల పేర్లను ఎలా మార్చిందో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దిశ పోలీస్ స్టేషన్లు ఎందుకు ?

హైదరాబాద్ శివారులో.. ఒక మెడికో పై హత్యాచారం జరిగింది. ఆ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. ఆ యువతి పేరును దిశగా మార్చింది తెలంగాణ సర్కార్. ఆ తర్వాతే.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు ఏ సమస్య వచ్చినా.. కంప్లైంట్ చేసిన గంటల్లోనే పరిష్కరించేలా దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దీనికి కేంద్రం అబ్జెక్షన్ చెబుతూ రాగా.. అప్పటికే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను దిశ పోలీస్ స్టేషన్లుగా మార్చింది అప్పటి ప్రభుత్వం. అయితే ఇప్పుడు దిశ పేరును తీసేసి.. మళ్లీ మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మార్చుతూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకా ఎన్ని పథకాల పేర్లు మారుతాయో చూడాలి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×